Hansika Motwani : త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్న మరో హీరోయిన్ !

అందాల ముద్దుగుమ్మ హన్సికా మొత్వాని..గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలుగులో పలు సూపర్ హిట్ సినిమాల్లో హీరోయిన్ గా నటించిన ఈ భామ..అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ స్టేటస్ సంపాదించుకుంది. ఈ క్రమంలోనే తెలుగులో పాటు ఇతర భాషల చిత్రాల్లో కథానాయికగా అవకాశాలు దక్కించుకుంది.


ఈ భామ గతంలో బొద్దుగా ఉండేది. కానీ, ఇప్పుడు కాస్త  సన్న బడింది. అయితే, చక్కనమ్మ చిక్కినా అందమే..అన్నట్లుగా చాలా అందంగా కనబడుతోంది హన్సిక. ఇది ఇలా ఉండగా.. ఈ అందాల ముద్దుగుమ్మ హన్సికా మొత్వాని.. త్వరలోనే పెళ్లి పీటలెక్కనుందట.

సౌతిండియాలోని ఓ ప్రముఖ రాజకీయ నాయకుడి కొడుకును వివాహం చేసుకోనుందట. ఈ మేరకు ఇప్పటికే అన్ని సంప్రదింపులు జరిగాయని.. త్వరలోనే ఎంగేజ్‌ మెంట్‌, వివాహ తేదీలను ఫైనల్‌ చేయనున్నారని టాక్‌ వినిపిస్తోంది. అంతేకాదు.. వీరిది లవ్‌ అండ్‌ అరెంజ్‌ మ్యారేజ్‌ అని కూడా టాక్‌.