Hanuman Movie : ‘హనుమాన్’ ఫస్ట్ డే కలెక్షన్లు ఎన్నంటే?

-

తేజ సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన “హనుమాన్” కు తక్కువ థియేటర్లు లభించినా కలెక్షన్లు మాత్రం తగ్గలేదు. ఒక్కరోజులో సినిమాకు రూ. 20 కోట్లు వచ్చినట్లు సినీ వర్గాలు పేర్కొన్నాయి. ఇండియాలో హనుమాన్ కు రూ. 14.06 కోట్లు, ఓవర్సీస్ లో రూ. 7.29 కోట్లతో మొత్తం రూ. 21.35 కోట్లు వసూలు చేసినట్లు సమాచారం. స్క్రీన్స్ పెరగడంతో ఈరోజు నుంచి కలెక్షన్లు పెరిగే అవకాశం ఉంది.

Hanuman Movie Box Office Collection Day 1

ఇక అటు మహేష్ బాబు ‘గుంటూరు కారం’ సినిమాకు ‘హనుమాన్’ చిత్రం నుంచి తీవ్రపోటీ ఎదురవుతోంది. సూపర్ హిట్ టాక్ రావడంతో USAలో హనుమాన్ ఏకంగా 1 మిలియన్ డాలర్స్ మార్క్ కలెక్షన్ల దిశగా సాగుతోంది. ప్రస్తుతం హనుమన్ 500K డాలర్ల కలెక్షన్లు పొందగా…. ఇదే సమయంలో గుంటూరు కారం సినిమాకు 374K డాలర్ల కలెక్షన్లు వచ్చాయి. మహేష్ సినిమా కంటే పాజిటివ్ టాక్ ఉండడంతో హనుమాన్ కలెక్షన్లు రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news