బాక్సాఫీస్ వద్ద హనుమాన్ ర్యాంపేజ్.. మూడోరోజు కలెక్షన్స్ ఎంతంటే?

-

ఇండియన్ సూపర్ హీరో సినిమాగా వచ్చిన హనుమాన్ బాక్సాఫీస్ వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. రిలీజ్ అయిన రోజు నుంచే హౌస్ఫుల్ షోస్తో రన్ అవుతోంది. రోజులు గడిచే కొద్ది ప్రేక్షకులు ఇంకా ఇంకా థియేటర్లకు క్యూ కడుతూనే ఉన్నారు. తొలి రెండు రోజుల కంటే ఆదివారం (జనవరి 14) ఎక్కువ వసూళ్లు సాధించినట్లు సినీ ట్రేడ్ వర్గాలు తెలిపాయి.

దేశవ్యాప్తంగా హనుమాన్ సినిమా మూడో రోజు రూ.15.50 కోట్ల కలెక్షన్లు చేసినట్లు వెల్లడించాయి. మొత్తం రూ.40.15 కోట్లు వసూళ్లు సాధించిందని టాక్. విడుదలైన మూడు రోజుల్లోనే హనుమాన్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ అందుకుంది. ఈ సినిమాను రూ.20 కోట్ల బడ్జెట్తో తెరకెక్కించినట్లు సమాచారం. ఇప్పటి వరకు వచ్చిన వసూళ్లు పెట్టుబడి కంటే డబుల్ కావడం గమనార్హం.

హనుమాన్ మూవీ దేశవ్యాప్తంగా తొలి రోజు- రూ.12.20 కోట్లు వసూల్ చేయగా.. రెండో రోజు- రూ.12.45 కోట్లు, మూడో రోజు- రూ.15.50 కోట్ల వసూళ్లు సాధించినట్లు సినీ ట్రేడ్ వర్గాలు తెలిపాయి. మరోవైపు ఆదివారం తెలుగులో హనుమాన్ ఆక్యుపెన్సీ 83.69 శాతంగా నమోదైంది. అత్యధికంగా వరంగల్ 95 శాతం, హైదరాబాద్ 92 శాతంలో నమోదైంది.

Read more RELATED
Recommended to you

Latest news