బందీల్లో చాలా మంది చనిపోయి ఉంటారు: హమాస్‌

-

ఇజ్రాయెల్‌-హమాస్‌ యుద్ధం ఇంకా భీకరంగా కొనసాగుతూనే ఉంది. ఈ యుద్ధం ప్రారంభమై ఆదివారంతో 100 రోజులు పూర్తయింది. ఇప్పటికే వేల మంది సామాన్య ప్రజలు ఈ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయారు. యుద్ధం మొదలై 100 రోజులు పూర్తైన సందర్భంగా హమాస్‌ ఓ వీడియోను విడుదల చేసింది. అందులో తమ అధీనంలో ఉన్న ముగ్గురు ఇజ్రాయెలీ బందీలతో మాట్లాడించారు హమాస్ మిలిటెంట్లు. “వెంటనే మమ్మల్ని విడిపించాలని.. హమాస్‌పై సైనిక చర్యలను నిలిపివేయండి ప్లీజ్” అని బందీలు కోరుతున్నట్లు వీడియోలో ఉందని అంతర్జాతీయ మీడియా తెలిపింది.

మరోవైపు తమకు బందీలుగా చిక్కిన వారిలో చాలామంది గాజాలో చనిపోయి ఉండొచ్చని హమాస్‌ అధికార ప్రతినిధి అబు ఒబేదా ఆదివారం మరో ప్రకటన విడుదల చేశాడు. దీనికి ఇజ్రాయెల్‌దే బాధ్యత అని.. వారు చేపడుతున్న సైనిక చర్యల వల్లే చాలా మంది బందీలతో తాము సంబంధాలు కోల్పోయామని చెప్పాడు. ఇప్పటికీ సొరంగాల్లో ఉన్న బందీలకు తీవ్ర ముప్పు పొంచి ఉందన్న అబు ఒబేదా.. ఇజ్రాయెల్‌ దాడులు విస్తరించే కొద్దీ వారు మరింత ప్రమాదంలోకి జారుకుంటారని హెచ్చరించాడు.

Read more RELATED
Recommended to you

Latest news