స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ నేషనల్ మీడియాపై సంచలన వ్యాఖ్యలు చేశారు. దివంగత హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అనుమానాస్పద మృతి తరువాత ఈ కేసుని డ్రగ్ కోణంలో ఎన్సీబీ అధికారులు విచారించడం మొదలుపెట్టడం, ఆ తరువాత రియాని అదుపులోకి తీసుకోవడంతో సుశాంత్ కేసు జాతీయ స్థాయిలో సంచలనంగా మానరింది. ప్రస్తుతం ఈ కేసు మొత్తం డ్రగ్స్ చుట్టూ తిరుగుతుండటంతో జాతీయ మీడియా దీనిపై గత కొన్ని రోజులుగా సంచలన కథనాల్ని ప్రసారం చేస్తోంది. ఎవరు ఈ డ్రగ్ దందాలో వున్నారు. ఏ హీరోయిన్‌తో డ్రగ్స్‌కి సంబంధం వుంది వంటి విషయాల్ని బయటికి తీసి సంచనాలు సృష్టిస్తున్న జాతీయ మీడియా ఓ లెజెండ్‌ని పూర్తిగా పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది.
లెజెండరీ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం శుక్రవారం మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని జాతీయ మీడియా పొడి పొడిగా టచ్ చేసి డ్రగ్స్ వివాదాన్ని మాత్రం హైలైట్ చేసింది. అయితే ఇదే సమయంలో బీబీసీ వరల్డ్ బాలుపై ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించి లెజెండరీ గాయకుడికి ఘనంగా నివాళులర్పించింది. ఇదే హరీష్‌శంకర్ కి ఆగ్రహాన్ని, అసహనాన్ని కలిగించింది. దీంతో హరీష్ శంకర్ నేషనల్ మీడియాపై సెటైర్లు వేశారు. ట్విట్టర్ వేదికగా బీబీసీ వరల్డ్ వీడియోని షేర్ చేసి `ఇంటర్నేషనల్ మీడియా కూడా ఎంత అద్భుతంగా ప్రెజెంట్ చేసిందో.. మన నేషనల్ మీడియా ని చూస్తే జాలేస్తుంది.. అంతేలే.. కొందరి స్థాయి విశ్వవ్యాప్తం.. ఇరుకు సందుల్లో కాదు..` అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఇంటర్నేషనల్ మీడియా కూడా ఎంత అద్భుతంగా ప్రెజెంట్ చేసిందో..
మన నేషనల్ మీడియా ని చూస్తే జాలేస్తుంది..అంతేలే..
కొందరి స్థాయి విశ్వవ్యాప్తం..
ఇరుకు సందుల్లో కాదు.. pic.twitter.com/hcYDqMU9WK
— Harish Shankar .S (@harish2you) September 26, 2020