మెగా వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మెగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక బాలీవుడ్ లో తన సినిమాలను విడుదలకు చేయకపోయినా పాన్ ఇండియా హీరోగా గుర్తింపు సంపాదించుకున్నారు. ముందుగా మెగాస్టార్ చిరంజీవి నటవారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి అన్నకు తగ్గ తమ్ముడిగా గుర్తింపు తెచ్చుకున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఇక రాజకీయాలలోకి ప్రవేశించి జనసేన పార్టీని బలమైన శక్తిగా ఎదగడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇక అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి బాటలోని తమ్ముడు పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ అయ్యారు. ఇకపోతే పవన్ కళ్యాణ్ కు పవర్ స్టార్ అనే బిరుదు ఇవ్వడం వెనుక ఒక బలమైన కారణం ఉందని చెప్పవచ్చు.
హీరోగా మారక ముందు పవన్ కళ్యాణ్ తన చిన్న అన్నయ్య నాగబాబు అంజన ప్రొడక్షన్ బ్యానర్ లో నిర్మించిన పలు చిత్రాలకు సహనిర్మాతగా వ్యవహరించేవారు. ఇక అక్కడ అమ్మాయి ఇక్కడ అమ్మాయి సినిమా ద్వారా గీతా ఆర్ట్స్ బ్యానర్లు తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఇవివీ సత్యనారాయణ డైరెక్ట్ చేశారు. అయితే ఈ సినిమా పెద్దగా గుర్తింపు తెచ్చుకోలేదు. ఇక ఆ తర్వాత ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో గోకులంలో సీత అనే సినిమాను తమిళ్ నుంచి రీమేక్ చేశారు.ఇక ఆ చిత్రానికి పోసాని కృష్ణ మురళి మాటలు అందివ్వడం జరిగింది. ఈ సినిమా విడుదల సందర్భంగా పోసాని కృష్ణమురళి మొదటిసారి మీడియాతో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ను పవర్ స్టార్ అని సంబోధించారు.
ఇక ఆ తర్వాత చాలా పత్రికలు పవన్ కళ్యాణ్ పేరు ముందు పవర్ స్టార్ అనే బిరుదుతోని కథనాలు రాసేయడం మొదలుపెట్టారు . ఇక అలా ఆ రోజు నుంచి పవన్ కళ్యాణ్ కాస్తా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గా మారిపోయాడు. సూపర్ గుడ్ ఫిలిమ్స్ బ్యానర్ లో వచ్చిన సుస్వాగతం సినిమాలో తొలిసారిగా పవన్ కళ్యాణ్ కి పేరు ముందు పవర్ స్టార్ రావడం జరిగింది.