మాదాపూర్ డ్రగ్స్ కేసులో నటుడు నవదీప్ వేసిన పిటీషన్ పై హైకోర్టులో విచారణ జరగనుంది. ఈ కేసులో నిందితుడుగా ఉన్న రామ్ చంద్ రిమాండ్ రిపోర్టులో నవదీప్ ను పోలీసులు డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు చూపగా, తనకు ఈ కేసుతో సంబంధం లేదని నవదీప్ హైకోర్టును ఆశ్రయించారు.

దీంతో ఈ నెల 19 వరకు నవదీప్ ను అరెస్టు చేయొద్దని ఆదేశించిన కోర్టు….నేడు మరోసారి విచారణ చేపట్టనుంది. నవదీప్ పై పోలీసులు నేడు కౌంటర్ దాఖలు చేసే ఛాన్స్ ఉంది. కాగా, హీరో నవదీప్ ఇంట్లో నార్కోటిక్ బ్యూరో సోదాలు నిర్వహిస్తున్నారు.
మాదాపూర్ డ్రగ్స్ కేసులో నిందితుడిగా ఉన్న హీరో నవదీప్… ఇంట్లో నార్కోటిక్ బ్యూరో సోదాలు నిర్వహిస్తున్నారు. పోలీసులు సోదాలు చేసే సమయంలో నవదీప్..ఇంట్లో లేడని సమాచారం అందుతోంది. తనను అరెస్టు చేయవద్దు ఇప్పటికే కోర్టు నుంచి ఆదేశాలు తెచ్చుకున్నాడు హీరో నవదీప్..ఈ రోజు వరకు నవదీప్ ను అరెస్టు చేయొద్దు అంటూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.