కొత్త పార్లమెంట్ బిల్డింగ్‌కి “పార్లమెంట్ హౌస్ ఆఫ్ ఇండియా”గా నామకరణం

-

కొత్తగా నిర్మించిన పార్లమెంట్ బిల్డింగ్‌కి “పార్లమెంట్ హౌస్ ఆఫ్ ఇండియా”గా నామకరణం చేసింది మోడి సర్కార్. ఈ రోజు మంగళవారం నుంచి పార్లమెంట్ కొత్త భవనంలో సమావేశాలు జరుగుతాయని లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా ప్రకటించారు. కొత్తగా నిర్మించిన పార్లమెంట్ బిల్డింగ్‌కి “పార్లమెంట్ హౌస్ ఆఫ్ ఇండియా”గా నామకరణం చేసినట్లు పేర్కొన్నారు.

Naming of the new Parliament Building as Parliament House of India
Naming of the new Parliament Building as Parliament House of India

అత్యాధునిక హంగులతో నిర్మించిన కొత్త భవనం ఇకపై పార్లమెంటుగా సేవలు అందించనుంది. ఈ మేరకు కొత్తగా నిర్మించిన భవనాన్ని పార్లమెంట్ గా నోటిఫై చేస్తూ కేంద్ర ప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది. ఇప్పటికే పాత పార్లమెంట్ భవనానికి సభ్యులు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. సోమవారం పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ప్రారంభమయ్యాయి. సభ వాయిదా పడిన అనంతరం 96 ఏళ్ల నాటి పాత పార్లమెంట్ భవనానికి ఎంపీలు వీడ్కోలు పలికారు. నేటి నుంచి కొత్త భవనంలో మధ్యాహ్నం 1:15 గంటలకు లోక్ సభ, 2:15 గంటలకు రాజ్యసభ ప్రారంభమవుతాయి.

Read more RELATED
Recommended to you

Latest news