పుష్ప సినిమాతో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెలుసుకున్న విషయం తెలిసిందే. ఈ మూవీతో బన్నీకి బీ టౌన్ ఫాలోయింగ్ బాగా పెరిగిపోయింది. కేవలం హిందీ ప్రేక్షకులే కాదు హిందీ సినిమా నటులు కూడా బన్నీ యాక్టింగ్, స్టైల్‌కు ఫిదా అయ్యారు. తాజాగా బాలీవుడ్ అలనాటి తార డ్రీమ్‌గర్ల్ హేమ మాలిని కూడా బన్నీపై ప్రశంసలు కురిపించారు.
‘‘నాకు బన్నీ నటించిన ‘పుష్ప’ చాలా నచ్చింది. అందులో అతడి లుక్ చూసి ఆశ్చర్యపోయాను. ఆ సినిమాలో అతడి డ్యాన్స్‌ను చాలా మంది అనుకరించారు. సెలబ్రిటీలు కూడా ఆ డ్యాన్స్ చేస్తూ ఎంజాయ్ చేశారు. గతంలో నేను చూసిన ఒక సినిమాలో అల్లు అర్జున్ చాలా అందంగా.. స్టైల్‌గా ఉన్నాడు. అలా ఉండే అతడు.. ‘పుష్ప’ కోసం పూర్తిగా తన లుక్‌ను మార్చేసుకున్నాడు. లుంగీ కట్టుకుని మాస్‌గా కనిపించాడు. ఎలాంటి గెటప్ వేసినా అతడు హీరోలానే ఉంటాడు. అలా డీ గ్లామర్ పాత్రలో నటించడానికి అతడు అంగీకరించడం ఎంతో అభినందనీయమైన విషయం. మన హిందీ సినిమాల్లో హీరోలు అలా కనిపించడానికి, అలాంటి పాత్రలు చేయడానికి ఆలోచిస్తారు. ఒక సినిమాలో కాస్త నల్లగా కనిపించాలంటే హీరో ధర్మేంద్ర వెనుకాడారు. ఈ విషయం నాకు ఇప్పటికీ గుర్తే’’ అని అన్నారు.