సీఎం రేవంత్ సర్కారుపై కరీంనగర్ జిల్లా ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.మాజీ సీఎం కేసీఆర్‌పై కోపంతోనే ఉత్తర తెలంగాణ ప్రాజెక్టులను కాంగ్రెస్ సర్కార్ ఎండబెడుతున్నదని వారు మండిపడుతున్నారు.
ఈ వేసవిలో ఎల్ఎండీ జలాశయం ఎండిపోవడంతో సాగు,తాగు నీటి కష్టాలు ఎదురవడంతో జిల్లా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు సమాచారం.సాగునీరు లేకపోవడంతో కరీంనగర్ జిల్లాలో 50 శాతం పంటలు ఎండిపోయినట్లు తెలుస్తోంది. ఇప్పటికైనా కాళేశ్వరం జలాలను ఎత్తిపోయాలని, తద్వారా సాగు, తాగునీటిని అందించాలని జిల్లా ప్రజలు రేవంత్ సర్కారును డిమాండ్ చేస్తున్నారు.