ఒకప్పుడు టీవీ ఛానెల్స్ రావటం వల్ల థియేటర్స్ కు వచ్చే ఆడియన్స్ చాలా వరకు తగ్గిపోయారు. ఇప్పుడు ఇదే పరిస్థితి టీవీ ఛానెల్స్ కూడా వచ్చింది.ప్రస్తుతం వున్న మొబైల్ ఫోన్ టెక్నాలజీ వల్ల కోరుకున్న సినిమా కోరుకున్న సమయంలో చూసే వెసులుబాటు వచ్చేసింది. ఇందులో ప్రస్తుతం వున్న ఓటిటిలు టీవీను దారుణంగా దెబ్బకొట్టడం చేసాయి. థియేటర్స్ రిలీజ్ అయిన సినిమాలు వెంటనే ఓటిటి లోకి వస్తున్నాయి. ఒకప్పుడు ఆ సినిమా ఎప్పుడు టీవీ లో వస్తుందో అని అందరూ ఆసక్తిగా ఎదురు చూసేవారు.కాని ప్రస్తుతం దీని హవా చాలా వరకు తగ్గి పొయింది. ఇదే పరిస్థితి హీరో నానికి ఎదురయ్యింది.
నేచురల్ స్టార్ నాని అంటే మినిమం గ్యారెంటీ హీరో. తాను చేసిన ప్రతి సినిమా హిట్ లేదా ఏవరేజ్ గా ఆడేవి. ప్రస్తుతం తన పరిస్థితి అస్సలు బాగోలేదు. తన గత సినిమా అంటే సుందరానికి థియేటర్స్ లో విడుదల అయ్యి ప్లాప్ అయ్యింది. అదే సినిమా టీవి ఛానల్ లో వేస్తే 1.8 రేటింగ్ వచ్చింది. ఇది మీడియం రేంజ్ హీరోలకు చాలా తక్కువ. వాస్తవానికి తన బలే బలే మగాడివోయ్ సినిమా ఇప్పుడు టీవీ లో వచ్చినా అంతకంటే ఎక్కువ రేటింగ్ వస్తుంది. కాని అంటే సుందరానికి సినిమా రిజల్ట్ ను చూసి నాని తట్టుకోలేక పోతున్నాడట.
ఈ సినిమా కోసం ప్రత్యేకంగా మలయాళం నుండి హీరోయిన్ ను బతిమిలాడి మరీ ఒప్పించారట. ఆమెను షూటింగ్ లో రాజకుమారి కంటే కూడా ఎక్కువగా చూసుకున్నారట. సినిమా ఎక్కువ లెంగ్త్ వచ్చినా, డైరెక్టర్ వుంచుదామని అనేసరికి నాని కూడా మాట్లాడకుండా వుండిపోయాడట. నానిని ఈ సినిమా థియేటర్ ప్లాప్ కంటే టెలివిజన్ ప్లాపే ఎక్కువుగా బాధ పెట్టిందట. ఎందుకంటే తన ప్రతి సినిమా కు ఫ్యామిలీ ఆడియన్స్ సపోర్ట్ ఫుల్ గా వుంటుంది. కాని వారు ఇంట్లో ఉండి కూడా సినిమా చూడటానికి ఇష్టపడలేదు. ఇదే విషయంపై నాని తెగ బాధపడుతున్నాడట.