ఐకూ నుంచి కొత్త ఫోన్ లాంచ్‌కు రెడీ అయింది. ఈ నెల 20న చైనాలో లాంచ్ కానుంది. అదే ఐకూ నియో 7. లాంచ్‌కు ముందే ఫోన్‌కు సంబంధించి కొన్ని వివరాలు లీక్ అయ్యాయి.. మరీ లీకుల ఆధారంగా విశేషాలు ఎలా ఉన్నాయో చూద్దామా..!
ఐకూ నియో 7 స్పెసిఫికేషన్లు, ఫీచర్లు (అంచనా)
దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉండనుందని తెలుస్తోంది.
120W ఫాస్ట్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుందని వార్తలు వస్తున్నాయి.
అంటే కేవలం 15 నిమిషాల్లోనే ఈ ఫోన్ చార్జింగ్ అవుతుందన్న మాట.
డివైస్ 3సీ లిస్టింగ్‌లో కూడా ఈ చార్జింగ్ కెపాసిటీతోనే లిస్ట్ అయింది.
ఇందులో 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్న 6.78 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లే అందించనున్నారు.
ఐకూ నియో 7 స్మార్ట్ ఫోన్‌లో వెనకవైపు మూడు కెమెరాలు ఉండనున్నాయి.
వీటిలో ప్రధాన కెమెరాగా 50 మెగాపిక్సెల్ సోనీ ఐఎంఎక్స్766వీ సెన్సార్ అందుబాటులో ఉండనుంది.
దీంతోపాటు 13 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 13 మెగాపిక్సెల్ టెలిఫొటో లెన్స్ అందించనున్నారు.
మీడియాటెక్ డైమెన్సిటీ 9000 ప్లస్ చిప్‌సెట్‌పై ఈ ఫోన్ పని చేయనుంది.
ఈ ఫోన్ ఆరెంజ్ కలర్‌లో కొనుగోలు చేయవచ్చు. దీని ముందు వెర్షన్ కూడా ఆరెంజ్ కలర్‌లోనే లాంచ్ అయింది.
ఐకూ నియో 6 మనదేశంలో రూ.29,999 ధరతో లాంచ్ అయింది. దీని స్పెసిఫికేషన్లు చూస్తే… ఆండ్రాయిడ్ 12 ఆధారిత ఆరిజిన్ ఓఎస్ ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. ఇందులో 6.62 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. 12 జీబీ వరకు ర్యామ్, 256 జీబీ వరకు స్టోరేజ్ ఇందులో ఉన్నాయి. ఇందులో వెనకవైపు మూడు కెమెరాలు అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 64 మెగాపిక్సెల్ కాగా… దీంతోపాటు 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 2 మెగాపిక్సెల్ మోనోక్రోమ్ లెన్స్ కూడా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 16 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు.