నేడు ఈడి ఎదుట విచారణకు హాజరు కానున్న హీరో నవదీప్

-

నేడు ఈడి ఎదుట విచారణకు హాజరు కానున్నారు టాలీవుడ్‌ హీరో నవదీప్. ముగ్గురు నైజీరియన్ల తో హీరో నవదీప్ కు పరిచయాలు ఉన్నట్లు ఈడీ అధికారులు గుర్తించారు. వీరితో జరిపిన లావాదేవీల పై వివరాలు ఆరా తీయనున్నారు ఈడి. నేడు ఈడి ఎదుట విచారణకు హాజరు కానున్న టాలీవుడ్‌ హీరో నవదీప్ దగ్గర కీలక విషయాలను రాబట్టనున్నారు.

Narcotic Bureau searches at hero Navdeep’s house

మాదాపూర్ డ్రగ్స్ కేసు వివరాలు ఇవ్వాలంటూ ఇప్పటికే నార్కోటిక్ పోలీసులను కోరింది ఈ డి. డ్రగ్స్ విక్రయాల ద్వారా మనీ లాండరింగ్ జరిగిందన్న కోణంలో ఈడి దర్యాప్తు చేస్తోంది. నవదీప్ అకౌంట్లో తో పాటు అరెస్టైన నైజీరియన్ లతో ఉన్న పరిచయాలపై కూపిలాగనుంది ఈడి. ఇది ఇలా ఉండగా, టాలీవుడ్ హీరో నవదీప్ కి డ్రగ్స్ తో లింక్ ఉందనే అనుమానంతో గత కొంత కాలంగా వార్తల్లో నిలుస్తున్నారు. ఈ తరుణంలోనే.. సెప్టెంబర్‌ 23 వ తేదీన నటుడు నవదీప్ ను నార్కోటిక్ అధికారులు డ్రగ్స్ కేసులో విచారించారు. దాదాపు 6 గంటలకు పైగా పలు ప్రశ్నలను సంధించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version