బిజెపి తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి అత్యవసర సమావేశం నిర్వహించారు. ఆఫీస్ బేరర్స్, జిల్లా అధ్యక్షులతో భేటీ అయ్యారు తెలంగాణ బిజెపి అధ్యక్షుడు కిషన్ రెడ్డి. ఈ సమావేశం బిజెపి పార్టీ కార్యాలయంలో జరుగుతోంది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రాజకీయ పరిస్థితులు అలాగే రేవంత్ రెడ్డి ప్రభుత్వ వైఫల్యాల పై పోరాటం ఎలా చేయాలి అనే దానిపైన… తెలంగాణ బిజెపి అధ్యక్షుడు కిషన్ రెడ్డి చర్చిస్తున్నారు.
ఇక ఆటో హైదరాబాద్ లోకల్ బాడీ ఎన్నికల్లో ఎంఐఎం, గులాబీ పార్టీ అలాగే కాంగ్రెస్ పార్టీలో కుమ్మకు అయినట్లు బండి సంజయ్ సంచలన కామెంట్స్ చేశారు. లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయాలని ఆలోచన చేస్తున్నట్లు కూడా బండి సంజయ్ కుమార్ ప్రకటన చేశారు. దీనిపై చర్చించి పార్టీ తుది నిర్ణయాన్ని తీసుకుంటుందని కేంద్ర మంత్రి బండి సంజయ్ తెలిపారు.