హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో భూములు చదును చేయడాన్ని విద్యార్థులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.దీంతో అక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తుగా పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు.ఈ నేపథ్యంలోనే హెచ్‌సీయూ భూములపై మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక ప్రకటన చేశారు.
హెచ్‌సీయూ పక్కనే ఆనుకుని ఉన్న ఆ 400 ఎకరాల భూమి ప్రభుత్వానిదేనని అన్నారు.గతంలో ప్రైవేట్ సంస్థలకు 21 ఏళ్ల క్రితం కేటాయించిన భూమిని న్యాయపోరాటం చేసి తిరిగి ప్రభుత్వం దక్కించుకుందన్నారు.భూముల వేలం, అక్కడ చేపట్టబోయే అభివృద్ధి పనులతో యూనివర్సిటీకి ఎలాంటి నష్టం వాటిల్లదన్నారు.అభివృద్ధికి పనుల కోసం ఇచ్చిన భూమిలో చెరువు లేదని, అవసరమైతే హెచ్‌సీయూ భూములపై ప్రభుత్వం పున: పరిశీలన చేస్తుందని హామీ ఇచ్చారు.