నితిన్ సినిమా కు ముహూర్తం ఫిక్స్

-

ఈమధ్యనే విడుదలైన భీష్మ మూవీ సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకోవడంతోొ హీరో నితిన్ ఫుల్ జోష్ లో ఉన్నాడు. చాలా కాలంగా హిట్ కోసం వెయిట్ చేస్తున్న నితిన్ కు కరెక్ట్ హిట్ పడింది. దీంతో ఇప్పుడు తన నెక్స్ట్ మూవీపై దృష్టి పెట్టాడు. వెంకీ అట్లూరితో రంగ్ దే అనే సినిమాని ఎప్పుడో ప్రారంభించారు. ఈ చిత్రంలో హీరోయిన్ గా కీర్తి సురేష్ నటిస్తోంది.

వెంకీ తన గత చిత్రాల మాదిరిగానే ఈ చిత్రాన్ని రొమేంటిక్ లవ్ స్టోరీగా తెరకెక్కించనున్నాడు. అలాగే సినిమాలో చాలా భాగం విదేశాల్లో చిత్రీకరించారు. ఇప్పుడు ఈ సినిమాకు అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి జులై 31 న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. ఇంతకు ముందు కూడా ఈ డేట్ కే అనుకుని వెనకడుగు వేశారు. ఎందుకంటే తెలుగులో రాజమౌళి తాను తెరకెక్కిస్తున్న ట్రిపుల్ ఆర్ సినిమాను ఈ నెలలోనే రిలీజ్ చేస్తామని చెప్పడంతో ప్రొడ్యూసర్లు వెనకడుగు వేశారు. కానీ రాజమౌళి ట్రిపుల్ ఆర్ రిలీజ్ డేట్ ను వాయిదా వేసి జనవరిలో విడుదల చేస్తామని చెప్పడంతో ఈ సినిమాకు లైన్ క్లియర్ అయింది.

వీళ్ళు అనుకున్న డేట్ దొరకడంతో బ్యాలెన్స్ వర్క్ వేగంగా చేస్తున్నారట. నితిన్ సినిమాలో తన పార్ట్ ఫినిష్ అయిన వెంటనే హిందీ రీమేక్ అందాధూన్ కోసం ప్రిపేర్ అవుతున్నాడట. అందులో గుడ్డివాడి పాత్రలో నితిన్ నటించబోతున్నాడు. దీనికోసం నితిన్ ప్రత్యేకమైన శిక్షణ తీసుకుంటున్నాడట. సో సమ్మర్ స్టాటింగ్ లో భీష్మ తో హిట్ కొట్టిన నితిన్ ఇప్పుడు సమ్మర్ ఎండింగ్ లో రంగ్ దే విజయంపై కన్నేశాడు. ఈ సినిమా హిట్ అవడం ఇప్పుడు నితిన్ కంటే కూడా వెంకీ చాలా ముఖ్యం ఎందుకంటే నితిన్ భీష్మ తో హిట్ కొట్టాడు. కానీ వెంకీ అట్లూరి మాత్రం మిస్టర్ మజ్ను తీవ్ర నిరాశను మిగిల్చింది. మరి ఈ సినిమా నితిన్ ఖాతాలో మరో హిట్ ని వేస్తుందో లేదో చూడాలి. కాగా ఈ చిత్రానికి పీసీ శ్రీరామ్ ఈ సినిమాకి కెమెరామెన్ గా పనిచేస్తున్నాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version