సీఎం రేవంత్ రెడ్డికి హీరో సిద్ధార్థ్ కౌంటర్..నేను కండోమ్స్ పట్టుకున్నానని ?

-

తెలంగాణ ప్రభుత్వ పెద్దలకు నటుడు సిద్ధార్థ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. 20 ఏళ్లుగా తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్నానని…. 2005 నుంచి 2011 వరకు నేను కండోమ్స్ ను ప్రమోట్ చేశానని తెలిపారు. సినిమా టికెట్‌ రేట్‌ పెంచాలని అడిగే వారు.. డగ్ర్స్‌ పై ఓ వీడియోను ప్రత్యేకంగా చేసి ఇవ్వాలని రేవంత్‌ రెడ్డి గంలోనే పేర్కొన్నారు. అయితే.. దీనిపై సిద్ధార్థ్‌ కు ఓ ప్రశ్న ఎదురైంది. ఈ తరుణంలోనే… తెలంగాణ ప్రభుత్వ పెద్దలకు నటుడు సిద్ధార్థ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.

Hero Siddharth is the counterpart of CM Revanth Reddy

నా అంతట నేనే సామాజిక బాధ్యత తీసుకొని ఆ యాడ్ చేశాను. కానీ నాకు ఎవరో సీఎం చెప్పారని.. నేను చేయలేదన్నారు. ఇప్పటిదాకా ఇలా చేస్తేనే అలా చేస్తామని ఏ ముఖ్యమంత్రి మాతో చెప్పలేదని చురకలు అంటించారు. అయితే..ఆ తర్వాత సిద్ధార్థ్‌ కు బెదిరింపులు వచ్చినట్లు సమాచారం. దీంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపు మేరకు ముందుకొస్తున్నట్లు సినీ హీరో సిద్ధార్థ ప్రకటించారు.

భారతీయుడు 2 చిత్రం విడుదల సందర్భంగా డ్రగ్స్ పై అవగాహన కల్పించిన సిద్ధార్థ… తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పోలీస్ శాఖ చేస్తున్న ప్రయత్నంలో తాము భాగస్వామ్యం అవుతామని వెల్లడించారు. పిల్లల భవిష్యత్తు వాళ్ళ చేతుల్లో కాకుండా మనందరి చేతిల్లో ఉంది డ్రగ్స్ ను పూర్తిగా నిర్మూలించాలి…వాళ్ల భవిష్యత్తును కాపాడాల్సిన బాధ్యత మనందరి పైన ఉందన్నారు. మంచి సొసైటీ నిర్మించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోలీస్ శాఖ చేస్తున్న ప్రయత్నంలో తాము భాగస్వామ్యం అవుతామని వివరించారు.

Read more RELATED
Recommended to you

Latest news