మూడోసారి తండ్రి కాబోతున్న స్టార్ హీరో!

-

తమిళ్ స్టార్ హీరో శివకార్తికేయన్‌ త్వరలో తండ్రి కాబోతున్నట్లు సమాచారం. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ఈ వార్త జోరుగా చక్కర్లు కొడుతోంది. ఇప్పటికే శివకార్తికేయన్‌- ఆర్తి దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్న విషయం తెలిసిందే. చాలాకాలం తర్వాత ఇప్పుడీ జంట మూడో బిడ్డ కోసం ప్లాన్‌ చేశారని కోలీవుడ్ మీడియా కోడై కూస్తోంది.

తాజాగా ఓ అభిమాని తనయుడి పుట్టినరోజు వేడుకలకు శివకార్తికేయన్‌, ఆయన భార్య ఆర్తి గెస్టులుగా వెళ్లారు. ఆ వీడియోలో ఆర్తికి కాస్త పొట్ట ఉన్నట్లుగా కనిపించడంతో నెటిజన్లు, అభిమానులు అది బేబీ బంప్‌ అయి ఉండొచ్చని అంటున్నారు. ఈ వీడియోను వైరల్ చేస్తూ ఈ జంటకు కంగ్రాట్స్ చెబుతున్నారు. త్వరలో మరో జూనియర్‌ శివకార్తికేయన్‌ రాబోతున్నారని హర్షం వ్యక్తం చేస్తున్నారు. శివకార్తికేయన్‌ ఇండస్ట్రీలోకి రాకుముందే 2010లో ఆర్తిని పెళ్లి చేసుకున్నారు. వీరికి 2013లో కూతురు ఆరాధన, 2021లో కుమారుడు గుగన్‌ దాస్‌ జన్మించారు. శివకార్తికేయన్కు తెలుగులోనూ ఫుల్ ఫాలోయింగ్ ఉందన్న సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version