‘రెట్రో’ వివాదంపై స్పందించిన హీరో విజయ్ దేవరకొండ

-

Hero Vijay Deverakonda responds to Retro controversy: ‘రెట్రో’ వివాదంపై స్పందించారు టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ. ‘రెట్రో’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఆదివాసీలను అవమానించారంటూ విజయ్ దేవరకొండపై ఫిర్యాదు చేశారు. ఎవరినీ బాధించడం తన ఉద్దేశం కాదని ‘ఎక్స్’ ద్వారా తాజాగా క్లారిటీ ఇచ్చారు టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ. ఈ మేరకు పోస్ట్ కూడా పెట్టారు.

Hero Vijay Deverakonda responds to Retro controversy
Hero Vijay Deverakonda responds to Retro controversy

హీరో విజయ్ దేవరకొండపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ఫిర్యాదు అయింది. ఏప్రిల్ 26వ తేదీన రెట్రో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ‘500 ఏళ్ల కింద ట్రైబల్స్ కొట్టుకున్నట్టు పాకిస్తాన్ వాళ్ళు బుద్ధి లేకుండా చేసే పనులు ఇవి’ అంటూ వ్యాక్యాలు చేశారు విజయ్ దేవరకొండ. గిరిజన జాతిని అవమాన పరుస్తూ మాట్లాడాడని హీరో విజయ్ దేవరకొండపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ఫిర్యాదు చేశారు ట్రైబల్ లాయర్స్ అసోసియేషన్ సభ్యులు.

Read more RELATED
Recommended to you

Latest news