ఏపీ రాజధాని అమరావతి నిర్మాణ పనులు ఊపందుకున్నాయి. నిన్న ప్రధాని మోడీ సీఎం చంద్రబాబు సమక్షంలో రాజధాని నిర్మాణ పనులను పున: ప్రారంభించిన విషయం తెలిసిందే. దీంతో రాజధాని నిర్మాణ పనులను అధికారులు వేగవంతం చేశారు.
ప్రధాని మోదీ చేతుల మీదుగా పునః ప్రారంభోత్సవ కార్యక్రమం పూర్తి కావడంతో పనులను ప్రభుత్వం వేగవంతం చేస్తున్నది. ఐకానిక్ భవనాల డిజైన్లు ఖరారు చేసేందుకు చర్చలు జరుపుతున్నారుజ డిజైన్లు రూపొందిస్తున్న సంస్థలతో మంత్రి నారాయణ చర్చలు జరిపారు.సీఆర్డీఏ కార్యాలయంలో నార్మన్ పోస్టర్, హఫీజ్ కాంట్రాక్టర్స్, L&T సంస్థల ప్రతినిధులతో మంత్రి సమావేశం నిర్వహించారు.ఐదు ఐకానిక్ టవర్లు, అసెంబ్లీ, హైకోర్టు భవనాల తుది డిజైన్లపై కసరత్తు ప్రారంభించారు. ఆయా భవనాల డిజైన్లను మంత్రి, అధికారులకు ఆర్కిటెక్చర్ సంస్థల ప్రతినిధులు వివరించారు.