రాష్ట్రంలోని రైతాంగం, సామాన్యుల భూ సమస్యల పరిష్కారానికి తెలంగాణ ప్రభుత్వం భూభారతిని తీసుకొచ్చిన విషయం తెలిసిందే. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఒక్కో మండలాన్ని పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి అధికారులు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.
తాజాగా భూ భారతి అవగాహన సదస్సులో ఓ రైతు ఆత్మహత్యాయత్నం చేశారు.తన భూమి కబ్జాకు గురైందని చెప్పినా ఆఫీసర్లకు పట్టించుకోవడంలేదని ఆత్మహత్యాయత్నం చేసినట్లు సమాచారం.సూర్యాపేట జిల్లాలో చింతలపాలెం మండల కేంద్రంలో భూ భారతి సదస్సును అధికారులు నిర్వహించారు. అయితే దొంగల నాగరాజు అనే రైతు తన వెంట తెచ్చుకున్న బాటిల్‌లోని పెట్రోల్‌ను మీద పోసుకొని ఆత్మహత్యాయత్నం చేశారు.
వెంటనే అలర్ట్ అయి పోలీసులు రైతును పక్కకు తీసుకెళ్లారు.తన భూమి కబ్జాకు గురైందని చెప్పినా ఆఫీసర్లు పట్టించుకోవడం లేదని, దీంతో ఆత్మాహత్యాయత్నం చేసినట్లు బాధితుడు తెలిపారు.అదే సదస్సులో మరో మహిళా రైతు కూడా పురుగుల మందు డబ్బాతో వచ్చి బెదిరించడంతో ఇద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.