పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టిందే ప్యాకేజీల కోసం – మంత్రి రోజా

-

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై తీవ్ర విమర్శలు చేశారు పర్యాటక శాఖ మంత్రి రోజా. శనివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టిందే ప్యాకేజీల కోసం అని ఆరోపించారు. చంద్రబాబును ముఖ్యమంత్రి చేయడమే ఆయన ధ్యేయమని.. పవన్ కళ్యాణ్ పార్టీ స్థాపించి తొమ్మిదేళ్లయిన స్థానిక సంస్థల ఎన్నికలలో కూడా పోటీ చేయలేదని అన్నారు. మరోవైపు దగ్గుబాటి పురందేశ్వరి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలా..? లేక టిడిపి అధ్యక్షురాలా..? అనే సందేహం కలుగుతుందన్నారు.

ఏపీ అప్పుల లో ఉందని ఆమె అనడం హాస్యాస్పదమన్నారు మంత్రి రోజా. తెలుగుదేశం పార్టీ హయాంలోనే తలకు మించిన అప్పులు చేశారని ఆరోపించారు. ఎన్టీఆర్ స్థాపించిన టిడిపిని చంద్రబాబు నుంచి నందమూరి కుటుంబం తీసుకోవాలని అన్నారు. ఓ మ్యాప్ తీసుకొని చంద్రబాబు పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నాడని.. 14 ఏళ్లు సీఎం గా ఉన్న సమయంలో గాడిదలు కాశారా..? అని తీవ్ర విమర్శలు చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version