ఈ ముద్దుగుమ్మలు వెండితెర పొలిటీషియన్స్..

-

ముద్దుగుమ్మలు: ఇండస్ట్రీలో ఒక్కప్పుడు అడపదడపా వచ్చే లేడీ ఓరియెంటెడ్​ చిత్రాలకు ఇప్పుడు ఆదరణ పెరుగుతోంది.దీంతో హీరోయిన్లకు ముఖ్య పాత్రలు దక్కుతున్నాయి​ . వారు కూడా ఎలాంటి పాత్రలు అయిన మొహమాటపడకుండా చేసేందుకు సిద్ధమవుతున్నారు.

వాస్తవానికి హీరోయిన్లు ఒక్కప్పుడు కేవలం గ్లామర్​ ఆరబోయడానికి, నామమాత్రంగా ఉండేవారు! వారి పపాత్రలకు అంత ప్రాముఖ్యత దక్కేది కాదు. కానీ ఇప్పుడు అంతా మారిపోయింది. హీరోలకు దీటుగా ఎలాంటి పాత్రనైనా చేయడానికి ఇంట్రెస్ట్ చూపుతున్నారు. పవర్‌ ఫుల్‌ అండ్ ఛాలెంజింగ్​ రోల్స్‌ చేస్తున్నారు. విలన్లకు దీటుగా నెగటివ్‌ రోల్స్‌లోనూ మెప్పిస్తున్నారు. ఈ క్రమంలోనే వెండితెరపై రాజకీయ నాయకురాలిగా కూడా కనిపించి సత్తా చాటుతున్నారు.

తాజాగా అక్కినేని నట సామ్రాట్, హీరో నాగచైతన్య నటించిన కస్టడీ సినిమా రిలీజై బాక్సాఫీస్​ వద్ద ఏవరేజ్​ టాక్​ తెచ్చుకుంది. అయితే ఈ చిత్రంలో నటి ప్రియమణి సీఎం పాత్రలో కనిపించి ఆడియెన్స్​ను అలరించింది. అయితే ఈమెనే కాదు.. సిల్వర్​ స్క్రీన్​పై ఇప్పటికే పలువురు ముద్దుగుమ్మలు కూడా ఇలా పాజిటివ్​ లేదా నెగటివ్​ షేడ్స్​ ఉన్న రాజకీయ నాయకురాలిగా కనిపించి సినీప్రియులను ఆకట్టుకున్నారు.

ఇటీవల విడుదలైన కస్టడీ చిత్రంలో సీఎంగా అద్భతంగా ఒదిగిపోయింది అలనాటి నటి ప్రియమణి.

అందాల భామ త్రిష ధర్మయోగిలో రాజకీయంగా ఎదగడానికి ఏమైనా చేసే వ్యక్తిగా కనిపించింది. ఈ సినిమాలో నెగటివ్ షేడ్స్​ ఉన్న పాత్ర పోషించింది.

నయనతార గాడ్​ఫాదర్​లో మొదటి రాజకీయాలకు దూరంగా ఉంటూ.. చివరికీ తన తండ్రి పార్టీ పగ్గాలు స్వీకరించి ముఖ్యమంత్రి అవుతుంది.

సరైనోడులో గ్లామర్ ఎమ్మెల్యేగా కనిపించింది కేథరిన్​. యూ ఆర్ మై ఎమ్మేల్యే సాంగ్ తో ఆడియెన్స్ ను ఫిదా చేసింది

హీరోయిన్ కృతిశెట్టి బంగార్రాజులో ప్రెసిడెంట్​ అవ్వాలని పరితపించే అమ్మాయిగా ఆకట్టుకుంది.

రమ్య కృష్ణ తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్​ క్వీన్​ వెబ్​సిరీస్​లో టైటిల్​ పాత్ర పోషించింది. సాయితేజ్ రిపబ్లిక్​ చిత్రంలోనూ రాజకీయనాయకురాలిగా కనిపించి అలరించింది.

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్​ తలైవీ సినిమాలో టైటిల్​ రోల్​, ఎమెర్జెన్సీ చిత్రంలో ఇందిరా గాంధీగా నటించింది బాలీవుడ్ భామ కంగనా రనౌత్.

కేజీఎఫ్​లో రవీనా టాండన్​.. ప్రధాన మంత్రి రమికా సేన్ పాత్ర పోషించి ఆకట్టుకుంది.

రాజకీయ నాయకురాలిగా రాజ్​నీతి చిత్రంలో నటించి సీఎం అవుతుంది కత్రినా కైఫ్.

హ్యూమా ఖురేషి రాజకీయ నాయకురాలిగా మహారాణి వెబ్​సిరీస్​లో నటించింది. ఇప్పటివరకు రెండు సీజన్లు స్ట్రీమింగ్ అయ్యాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version