హాట్ టాపిక్ గా మారుతున్న హీరోయిన్ అనుష్క రేమ్యూనరేషన్.. ఎన్ని కోట్లో తెలుసా..?

-

టాలీవుడ్ లో ఎంతమంది హీరోయిన్స్ ఉన్నప్పటికీ ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగిన హీరోయిన్లలో అనుష్క శెట్టి కూడా ఒకరు.. మొదట సూపర్ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ భారీగానే ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. తాజాగా నటుడు నవీన్ పోలిశెట్టితో కలిసి మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి అనే టైటిల్ తో ఒక సినిమాలో నటిస్తోంది.. అనుష్క టాలీవుడ్ తో పాటు కోలీవుడ్ లో కూడా పలు సినిమాలలో నటించింది. బాహుబలి సినిమాతో మంచి క్రేజ్ సంపాదించుకుంది అనుష్క.

ఈ సినిమాతో ఒక్కసారిగా పాన్ ఇండియా హీరోయిన్గా మారిపోయిన అనుష్క ఆ తర్వాత ఎన్నో చిత్రాలలో నటించిన పెద్దగా సక్సెస్ కాలేకపోయింది.. చివరిగా నిశ్శబ్దం అనే సినిమాలో చేసిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా మిగిలింది. దీంతో కాస్త గ్యాప్ తీసుకొని మరి ప్రస్తుతం సినిమాలలో నటిస్తోంది. తాజాగా అనుష్క శెట్టి రెమ్యూనరేషన్ గురించి ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారుతోంది. అనుష్క గతంలో ఒకో చిత్రానికి రూ .4 కోట్లు రూపాయలు తీసుకున్న.. ప్రస్తుతం ఒక్కో చిత్రానికి రూ .7 నుంచి రూ.8 కోట్ల రూపాయలు తీసుకుంటుందని టాక్ వినిపిస్తోంది.

అనుష్క నటించిన మిస్ శేట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా ఈ ఏడాది సెప్టెంబర్ 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇందులో ఈమె చెఫ్ గా కనిపించబోతోంది అలాగే కమెడియన్ నవీన్ పోలిశెట్టి కూడా ఇందులో నటించారు. ఈ సినిమా కచ్చితంగా హిట్ అవుతుందని చిత్ర బృందంతో పాటు అనుష్క అభిమానులు కూడా చాలా ధీమాతో ఉన్నారు..ఇప్పటివరకు ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news