వైద్యారోగ్యశాఖ డైరెక్టర్‌కు హరీష్ రావు వార్నింగ్ !

-

వైద్యారోగ్యశాఖ డైరెక్టర్‌కు మంత్రి హరీష్ రావు వార్నింగ్ ఇచ్చారట. అధికారిగా ఉంటూ రాజకీయ ప్రకటనలు చేస్తున్న వైద్యరోగ్యశాఖ డైరెక్టర్ గడల శ్రీనివాస్ కు మంత్రి హరీష్ రావు క్లాస్ తీసుకున్నట్లు సమాచారం. రాజకీయ ప్రకటనలు మానుకోవాలని శ్రీనివాసును హరీష్ రావు హెచ్చరించారట. అవకాశం ఇస్తే తాను బిఆర్ఎస్ తరపున కొత్తగూడెం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని డిహెచ్ శ్రీనివాస్ ఇప్పటికే పలుమార్లు ప్రకటించిన విషయం తెలిసిందే.

అయితే.. ఈ విషయంపై డాక్టర్ గడల శ్రీనివాసరావు స్పందించారు. కొత్తగూడెంలో పొలిటికల్ కామెంట్లు చేయొద్దని గౌరవ మంత్రి హరీశ్‌రావు గారు నాకు సూచించినట్లుగా, ఫోన్ చేసి క్లాస్ తీసుకున్నట్టుగా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవం అన్నారు డాక్టర్ గడల శ్రీనివాసరావు. డాక్టర్ జీఎస్‌ఆర్ ట్రస్ట్ సేవా కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఆదివారం కొత్తగూడెంలోనే ఉన్నాను. అక్కడి ప్రజల కష్టాలు తెలుసుకునేందుకు గడప గడపకు గడల కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిందని పేర్కొన్నారు. ఈ క్రమంలో గిట్టని వ్యక్తులు తప్పుడు ప్రచారాలు చేయిస్తున్నారు. ప్రజలు, మీడియా మిత్రులు ఆ ప్రచారాలను నమ్మొద్దని విజ్ఞప్తి చేస్తున్నాను. ఎవరెన్ని అడ్డుపుల్లలు వేసినా కొత్తగూడెంలో డా.జీఎస్‌ఆర్ ట్రస్ట్ సేవలు నిరాటంకంగా కొనసాగిస్తామని ప్రకటించారు డాక్టర్ గడల శ్రీనివాసరావు.

Read more RELATED
Recommended to you

Latest news