రాత్రి 7 గంటలకు ‘గాండీవధారి అర్జున’ రిలీజ్ ట్రైలర్

-

టాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరుచుకున్న యంగ్ హీరోలలో వరుణ్ తేజ్ ఒకరు. మెగా ప్రిన్స్ వరుణ్‌ తేజ్‌ వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. హిట్.. ప్లాఫ్​లతో సంబంధం లేకుండా సినిమాలు తీస్తున్నాడు. తాజాగా ఈ మెగా హీరోగా ప్రధాన పాత్రలో నటించిన.. ప్రవీణ్‌ సత్తారు రూపొందించిన చిత్రం ‘గాండీవధారి అర్జున’. ఇందులో వరుణ్‌కు జోడిగా సాక్షి వైద్య నటించింది. ఈ సినిమా ఆగస్టు 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కిన ‘గాండీవదారి అర్జున’ సినిమా రిలీజ్ ట్రైలర్ ఈరోజు రాత్రి 7 గంటలకు విడుదల కానుంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రిలీజ్ ట్రైలర్ ను లాంచ్ చేస్తారని మేకర్స్ ప్రకటించారు. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ లోని యాక్షన్ సీన్లు సినిమాపై అంచనా పెంచేసాయి. ఆగస్టు 25వ తేదీన ఈ చిత్రం థియేటర్లలో విడుదల కానుంది.

Read more RELATED
Recommended to you

Latest news