నా భర్త రూమ్ లోకి రావడం లేదన్న హీరోయిన్…!

-

రూమ్ లోకి అంటే కిచెన్ రూమ్ లోకి… కంగారు పడిపోయి ఏదో ఊహించుకోవద్దు. కరోనా లాక్ డౌన్ లో ఇప్పుడు సినీ ప్రముఖులు అందరూ కూడా ఇంట్లోనే ఉన్నారు. షూటింగ్ లేని సినిమా వాళ్ళు అందరూ కూడా ఇప్పుడు ఇంట్లో ఉండి తమ వంతుగా వంటలు చేస్తూ ఏదోక సహాయ సహకారం అందిస్తున్నారు. వంటలు చేసే వాళ్ళు కొందరు ఇల్లు ఊడ్చే వాళ్ళు మరి కొందరు. ఇలా ఎవరికి వారు సహాయం చేస్తున్నారు.

అయితే బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ మాత్రం వంట గదిలోకి అసలు రావడం లేదని అంటుంది ఆయన భార్య ప్రముఖ హీరోయిన్ కాజోల్. లాక్‌డౌన్ రావడంతో తనకు ఇష్టమైన వంటకాలు చేయమని తన భర్తను ఇంతా అడిగినా అస్సలు చేసిపెట్టడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. లాక్‌డౌన్‌ మొదలైనప్పట్నుంచే వంట చేయమని అంటున్నా ఆయన పట్టించుకోవడం లేదని చెప్పింది.

కనీసం కిచెన్‌ రూమ్‌లోకి కూడా వెళ్లడం లేదని, ఈ లాక్‌డౌన్‌లో తాను మాత్రం తనకు ఇష్టమైన పనులు చేస్తూ, ప్రతిరోజూ వ్యాయామాలు చేస్తున్నానని ఆమె వివరించింది. కరోనా కారణంగా 2020 అయిపోయిందని అనుకోవద్దని, ఇంకా ఏడు నెలల సమయముంది ఏదైనా చేసేయొచ్చని చెప్పింది. ఎవ్వరూ నిరాశ చెందొద్దని ఆమె చెప్పింది. వీళ్ళకు 20 ఏళ్ళ క్రితం వివాహం జరిగింది.

Read more RELATED
Recommended to you

Latest news