సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్న సోనియా!

-

సాధారణంగా సరైన సమయంలో సరైన నిర్ణయం అనేది… అధికారంలో ఉన్నన్నాళ్లూ కాంగ్రెస్ అధిష్టాణం స్లోగన్ ఇది! కాంగ్రెస్ పార్టీకి వీర విధ్యేయులు అనబడేవారంతా… మీడియా అడిగిన క్లిష్ట ప్రశ్నలకు అంతా ఇదే సమాధానం చెప్పేవారు. ఆ సంగతులు అలా ఉంటే… ఇంతకాలం చతికిలపడిపోయిన కాంగ్రెస్ పార్టీ… కరోనా పుణ్యమా అని జరిగిన పరిస్థితుల నేపథ్యంలో ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు… అది కూడా సరైన సమయంలో సరైన నిర్ణయం! అది కూడా దేశం మొత్తం మీద ఇబ్బందిపడుతున్న వలస కార్మికుల విషయంలో అవ్వడంతో… కాంగ్రెస్ కు మంచి మైలేజే వచ్చిందని అంటున్నారు విశ్లేషకులు.

వివారాళ్లోకి వెళ్తే… కొవిడ్-19 లాక్‌డౌన్ కారణంగా దేశంలోని పలు ప్రాంతాల్లో చిక్కుకుని అల్లాడుతున్న వలస కార్మికుల కోసం కాంగ్రెస్ పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. వలస కార్మికుల ప్రయాణ ఖర్చులను ఆయా రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ కమిటీలే భరిస్తాయని ఆ పార్టీ చీఫ్ సోనియా గాంధీ ప్రకటించారు. వలస కూలీలు, కార్మికులందరి రైలు ప్రయాణానికి అవసరమయ్యే ప్రతీ రూపాయీ స్థానిక కాంగ్రెస్ కమిటీలు భరించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది.

ఈ సందర్భంగా స్పందించిన సోనియా… వలస కార్మికుల కష్టాలకు కేంద్ర ప్రభుత్వ వైఖరే కారణమంటూ నిప్పులు చెరుగుతున్నారు. ఈ మేరకు ఇవాళ ఆమె కేంద్రానికి ఒక లేఖ కూడా రాశారు. వలస కార్మికులే దేశానికి వెన్నెముక అనీ, వారు ఇళ్లకు వెళ్లకుండా చిక్కుకుపోవడానికి కేంద్ర ప్రభుత్వమే కారణమని ఆరోపిస్తూ… కేంద్ర ప్రభుత్వం కేవలం 4 గంటలు సమయం ఇచ్చి లాక్‌ డౌన్ విధించిందంటూ మండిపడ్డారు. ఏది ఏమైనా…ఈ సమయంలో కనిపించకుండా పోయిన కాంగ్రెస్ పార్టీకి కాస్త ఊపుతెచ్చే నిర్ణయం ఇది అని పలువురు అభిప్రాయపడుతున్నారు!

Read more RELATED
Recommended to you

Latest news