Hi Nanna OTT : ఓటీటీలోకి నాని సూపర్‌ హిట్‌ సినిమా..ఎందులో అంటే ?

-

Hi Nanna OTT Streaming : నాచురల్ స్టార్ నాని హీరోగా మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ బ్యూటిఫుల్ చిత్రం “హాయ్ నాన్న”. మరి ఈ చిత్రం నాని కెరీర్ లో 30వ సినిమాగా కొత్త దర్శకుడు శౌర్యువ్ తెరకెక్కించగా మంచి బజ్ ని ఈ చిత్రం సొంతం చేసుకుంది. అయితే.. ఇటీవలే రిలీజ్‌ అయిన “హాయ్ నాన్న” థియేటర్లలో మంచి టాక్‌ తెచ్చుకుంది.

Hi Nanna OTT Streaming

కాగా నేచురల్ స్టార్ నాని, మృణాల్ ఠాకూర్ నటించిన ‘హాయ్ నాన్న’ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. నెట్ ఫ్లిక్స్ లో తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. తండ్రి కూతుర్ల సెంటిమెంట్ తో రూపొందిన ఈ మూవీలో నానికి కూతురిగా కియారా ఖన్నా నటించింది. శౌర్యువ్ దర్శకత్వం వహించిన ఈ మూవీ డిసెంబర్ 7న థియేటర్లలో విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకుంది. రూ. 75 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది.

Read more RELATED
Recommended to you

Latest news