ఆర్జీవీ పేరుతో హోట‌ల్.. సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన వ‌ర్మ

-

భిన్న‌మైన క‌థ ల‌తో సినిమాలు తీసే రామ్ గోపాల్ వ‌ర్మ.. ఆ సినిమాల‌తో పాటు ఆయ‌న వివాదాస్ప‌ద వ్యాఖ్య‌ల‌తో ఎక్కువ ప‌బ్లిసిటీ తెచ్చుకుంటాడు. అలాంటి రామ్ గోపాల్ వ‌ర్మ‌కు అభిమానులు కూడా చాలా మందే ఉన్నారు. ఆయ‌న ప‌ట్ల అభిమానాన్ని వివిధ రకాలుగా చూపిస్తారు. అయితే తూర్పు గోదావ‌రి కి చెందిన ఒక‌ అభిమాని మాత్రం కాస్త భిన్నంగా ఆలోచించి రామ్ గోపాల్ వ‌ర్మ పై ఉన్న ప్రేమ‌ను చూపించాడు. తాను కొత్త‌గా ఏర్పాటు చేసుకున్న హోట‌ల్ కు రామ్ గోపాల్ వ‌ర్మ హోట‌ల్ అని పేరు పెట్టుకున్నాడు.

అంతే కాకుండా ఆ హోట‌ల్ కు ఫ్లెక్సిల‌పై ఏకంగా రామ్ గోపాల్ వ‌ర్మ ఫోటోల‌ను కూడా ప్రింట్ చేయించాడు. దీంతో ఆ హోట‌ల్ కు మంచి గిరాకీ వ‌చ్చింది. ఫుల్ ఫేమ‌స్ అయింది. అయితే ఈ హోట‌ల్ కు సంబంధించిన ఒక వీడియో సోష‌ల్ మీడియాలో వైరల్ అయింది. ఆ వీడియో రామ్ గోపాల్ వ‌ర్మ కంట కూడా ప‌డింది. దీంతో రామ్ గోపాల్ వ‌ర్మ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశాడు. త‌న పేరుతో ఒక హోట‌ల్ ఉందంటే.. తాను చ‌నిపోయిన‌ట్టు అనిపిస్తుంది అంటూ త‌న స్టైల్ లో ట్విట్ట‌ర్ ద్వారా కామెంట్ చేశాడు. దీంతో ఆ కామెంట్ కు ఆర్జీవీ అభిమానులు వివిధ రకాలుగా కామెంట్స్ పెడుతున్నారు. ఏది ఎమైనా రంగంలో కి రామ్ గోపాల్ వ‌ర్మ దిగ‌డంతో ఆ హోట‌ల్ ఇంకా ఫుల్ ఫేమ‌స్ అవుతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version