దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమా మరో అరుదైన మైలురాయిని చేరుకుంది. ప్రతిష్టాత్మక గోల్డెన్ గ్లోబ్ అవార్డు సొంతం చేసుకుంది. లాస్ ఏంజెల్స్ వేదికగా 80వ గోల్డెన్ గ్లోబ్ అవార్డు వేడుక ఘనంగా ముగిసింది. భారత్ నుంచి ఆర్ ఆర్ ఆర్ మూవీ బెస్ట్ నాన్ ఇంగ్లీష్ మూవీ, బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగాల్లో నామినేషన్స్ సాధించిగా ఒక అవార్డు సొంతమైంది. గోల్డెన్ గ్లోబ్ జ్యూరీ మెంబర్ ‘నాటు నాటు’ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ గా ఎంపిక చేశారు. ఈ అవార్డు ను సంగీత దర్శకుడు కీరవాణి అందుకున్నారు..
ఆర్ఆర్ఆర్ సినిమాలో నాటు నాటు పాట గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ ను సొంతం చేసుకోగా.. ఈ అవార్డ్ ను సంగీత దర్శకుడు కీరవాణి అందుకున్నారు.. అయితే ఈ వేదికపై ఆయన పలువురిని ప్రస్తావిస్తూ వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు.. కానీ నిర్మాత డీవీ దానయ్యను మాత్రం మర్చిపోవడం చర్చినీ అంశం అయింది..
ఇంతటి ప్రతిష్టాత్మకమైన వేదిక పైన డివి దానయ్య పేరును కీరవాణి ప్రస్తావించలేదు. ఎంత గొప్ప దర్శకుడైనా… ఆయన ఆలోచనలు సినిమాగా రూపొందాలంటే డబ్బులు కావాలి. దర్శకుడి ఆలోచనలకు సరిపోయే విధంగా దృశ్యరూపం ఇవ్వడానికి వెనక ఉండి అన్ని సమకూర్చేది నిర్మాతే ముఖ్యంగా సినిమాను ముందు ఉండి నడిపించే కీలక వ్యక్తి నిర్మాత అయితే ఇలాంటి వ్యక్తి పేరును ఈ వేదికపై ప్రస్తావించకపోవడం ప్రస్తుతం చర్చకు దారి తీసింది..
అయితే ఈ అవార్డును అందుకున్న కీరవాణి అనంతరం ఎమోషనల్ స్పీచ్ ను ఇచ్చారు ఈ సందర్భంగా.. నాటు నాటు సాంగ్ ని అవార్డుకి ఎంపిక చేసిన గోల్డెన్ గ్లోబ్ జ్యూరీ మెంబర్స్ కి కృతఙ్ఞతలు తెలిపిన కీరవాణి… ఈ ఆనందాన్ని తన భార్య శ్రీవల్లితో పంచుకుంటున్నట్లు తెలిపారు. ఈ అవార్డు వాస్తవంగా ఎవరికి దక్కుతుందో ప్రాధాన్యతల వారీగా చెప్పుకొచ్చారు. మొదటగా దర్శకుడు రాజమౌళికి, తరువాత సాంగ్ కి కొరియోగ్రఫీ కంపోజ్ చేసిన ప్రేమ్ రక్షిత్ కి ఇచ్చాడు. తర్వాత తన కొడుకు కాల భైరవకు.. ఇక వరుసగా సింగర్ సిప్లిగంజ్, లిరిసిస్ట్ చంద్రబోస్, ఎన్టీఆర్, రామ్ చరణ్ లకు ఈ అవార్డు చెందుతుంది అన్నారు.