అల్లరి నరేష్ ఉగ్రం ట్విట్టర్ టాక్ ఎలా వుందంటే..?

-

అల్లరి నరేష్ నాంది డైరెక్టర్ విజయ్ కనకమేడలతో మళ్లీ తెరకెక్కించిన చిత్రం ఉగ్రం ఈరోజు అనగా మే 5 శుక్రవారం నాడు విడుదలయ్యింది. ముందుగా ఇది యూఎస్ఏ లో ప్రీమియర్స్ గా ప్రదర్శించబడిన విషయం తెలిసిందే. మరి అక్కడి టాక్ ఎలా ఉంది? ఆడియన్స్ ఏం చెబుతున్నారు? అనేది ఇప్పుడు ట్విట్టర్ టాక్ ద్వారా తెలుసుకుందాం.

ఒకప్పుడు కామెడీ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా మిగిలిన నరేష్ ఇప్పుడు ఆ కామెడీనే ఆయనకు వర్క్ ఔట్ కావడం లేదు అందుకే ఆయన తనను తాను మార్చుకోవాల్సి వచ్చింది. అలా సీరియస్ లుక్ లోకి తీసుకొని చేసిన నాంది సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఇక విజయ కనకమేడల ఆయనకు మంచి విజయాన్ని అందించారు. ఇకపోతే అల్లరి నరేష్ కి పూర్వ వైభవాన్ని తీసుకొచ్చారు విజయ్ కనకమేడల. ఇక ఈ సినిమా తర్వాత ఆయన చేసిన సినిమా మారేడుమిల్లి నియోజకవర్గం..ఈ సినిమా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేదు దీంతో మరొకసారి నాంది డైరెక్టర్ పైనే ఆధారపడ్డారు నరేష్.

ఈ క్రమంలోని ఉగ్రం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. మిస్టరీగా రూపొందిన చిత్రం ఇది. అమ్మాయిల కిడ్నాప్ నేపథ్యంలో సాగుతుందని సమాచారం. ఇందులో అల్లరి నరేష్ శివకుమార్ అనే సర్కిల్ ఇన్స్పెక్టర్ పాత్రలో చాలా బాగా నటించాడు అని సమాచారం. సినిమా కథ బాగుందట. మిస్టరీ ఆసక్తికరంగా మలిచాడు డైరెక్టర్.. కానీ దాన్ని తెరపై ఆవిష్కరించడంలో తడబడినట్టు తెలుస్తోంది. సినిమాలో చాలా వరకు మంచి సన్నివేశాలు ఉన్నాయని.. కానీ అవసరమైన కమర్షియల్ ఎలిమెంట్ జోడించడంలో కథ ట్రాక్ తప్పిందని సమాచారం.

మొదటి భాగం ప్రారంభంలో కథ చాలా ఇంట్రెస్ట్ గా ప్రారంభమైంది.. కానీ రొమాంటిక్ ట్రాక్ చాలా డల్ గా ఉందని ఏమాత్రం ఆకట్టుకోలేదని అంటున్నారు. ఇక సెకండ్ హాఫ్ కూడా పరవాలేదు అనిపిస్తోంది అని సమాచారం. ఇక పూర్తిస్థాయి రివ్యూ కోసం ఇంకా వేచి చూడాల్సిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version