తెలంగాణ లోని హైదరాబాద్ మహానగరంలో నిన్న నెల్లూర్ కు చెందిన వ్యక్తి దారుణ హత్యకు గురి కాబడ్డాడు. అసలు విషయాలు వెలుగులోకి రావాల్సి ఉంది. అయితే తెలుస్తున్న ప్రాథమిక సమాచారం మేరకు… నెల్లూరు కు చెందిన పొదలకూరు సురేష్ అనే యువకుడు పెయింటింగ్ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అయితే ఇతను నివాసం ఉండడానికి అద్దెకు ఇల్లు కావాల్సి వచ్చి… కౌకురు లో ఒక ఇల్లు ఖాళీగా ఉండడం ఓనర్ నాగేంద్రరావు ను సంప్రదించాడు. దీనితో వీరిద్దరూ అన్ని విషయాలు మాట్లాడుకుని తన ఇంటిని నెలకు రూ. 3 వేలు అద్దె ఇవ్వడానికి ఒప్పుకుని ఇంటిని తీసుకున్నాడు. అయితే రెండు మూడు రోజులకు సురేష్ రూం లో ఉంటున్న వ్యవహారం మరియు అతను ప్రవర్తనా శైలి పట్ల ఇంటి యజమాని నాగేంద్రరావు సహా చుట్టుపక్కల వారు అభ్యంతరం చెప్పడంతో అతన్ని ఇల్లు ఖాళీ చేయించారు.