పెళ్లికి సిద్ధమవుతున్న హృతిక్ రోషన్.. పెళ్ళి ఎప్పుడంటే..?

-

బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. గతంలో ప్రముఖ ఇంటీరియర్ డిజైనర్ సుసాన్ ఖాన్ ను ప్రేమించి మరీ వివాహం చేసుకున్న ఈయన ఇద్దరు కొడుకులు జన్మించిన తర్వాత ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో 2014లో విడాకులు తీసుకున్నారు. అయితే పిల్లల కోసం సన్నిహితంగా ఉన్న వీరిద్దరూ వ్యక్తిగతంగా తమ జీవితంలో మరొక తోడు వెతుక్కున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే సుసానే ఖాన్ తన ప్రియుడితో పెళ్లికి సిద్ధం కాక మరొకవైపు హృతిక్ రోషన్ కూడా తన ప్రేయసితో పెళ్లికి సిద్ధమవుతూ ఉండడం ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారుతోంది.

ఇకపోతే హృతిక్ రోషన్ తనకంటే వయసులో చాలా చిన్నదైనా సబా ఆజాద్ తో ప్రేమలో పడ్డాడు. చాలా కాలం పాటు డేటింగ్ చేసుకున్న వీళ్ళిద్దరూ .. ఎక్కడికి వెళ్లినా సరే కలిసి వెళ్తూ.. చట్టపట్టలేసుకొని తిరగడంతో మీడియా కంటపడ్డారు. అంతేకాదు ఇటీవల న్యూ ఇయర్ సందర్భంగా కూడా హృతిక్ రోషన్.. సబా ఆజాద్ ను కూడా తన కొడుకులతో పాటు వెకేషన్ కి తీసుకెళ్లి ఎంజాయ్ చేసినట్లు తెలుస్తోంది . అందుకు సంబంధించిన ఎయిర్పోర్ట్ ఫుటేజ్ లు కూడా వైరల్ అయ్యాయి.

ఇకపోతే హృతిక్ రోషన్ మాజీ భార్య సుసానే ఖాన్ కూడా సబా ఆజాద్ తో సన్నిహితంగా ఉంటుంది. ఈ క్రమంలోనే ఇప్పుడు హృతిక్ రోషన్.. సబా ఆజాద్ తో ఈ కొత్త ఏడాది వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నట్లు సమాచారం. అయితే ఇందులో ఎంత నిజం ఉంది అనేది తెలియదు కానీ.. ప్రస్తుతం బీ టౌన్ లో ఈ వార్తలు మాత్రం బాగా చెక్కర్లు కొడుతున్నాయి. ఏది ఏమైనా హృతిక్ రోషన్ మళ్ళీ పెళ్లి చేసుకోబోతున్నాడు అనే విషయాన్ని కంటే తనకంటే వయసులో చాలా చిన్న వయసు ఉన్న అమ్మాయిని వివాహం చేసుకోవడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version