మహేష్ ‘మహర్షి’ శాటిలైట్ రేటు అదిరింది

-

సూపర్ స్టార్ మహేష్ ప్రస్తుతం చేస్తున్న మహర్షి సినిమా వంశీ పైడిపల్లి డైరక్షన్ లో తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. దిల్ రాజు, అశ్వనిదత్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాలో మహేష్ సరసన పూజా హెగ్దె హీరోయిన్ గా నటిస్తుంది. అల్లరి నరేష్ కూడా ఈ సినిమా ఓ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాడు. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా 2019 ఏప్రిల్ 5న రిలీజ్ ప్లాన్ చేశారు.

ఈ సినిమా ఇంకా సగానికి పైగా షూటింగ్ జరుగాల్సి ఉండగా సినిమా శాటిలైట్ ఢీల్ సెట్ చేసుకున్నారని తెలుస్తుంది. మహేష్ సినిమాకు స్టార్ మా, జీ తెలుగు తరచు పోటీ పడుతుంటాయి. కాని ఈసారి మహేష్ సినిమా కోసం జెమిని టివి రంగంలోకి దిగింది. మహర్షి సినిమా ఏకంగా 14.5 కోట్ల ప్రైజ్ తో శాటిలైట్ రైట్స్ సొంతం చేసుకుంది. ఇది కేవలం తెలుగు శాటిలైట్ రైట్స్ మాత్రమే అని తెలుస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version