అంతరిక్షం టీజర్.. ఘాజిని మించేలా ఉంది

-

రానా దగ్గుబాటి హీరోగా సంకల్ప్ రెడ్డి డైరక్షన్ లో వచ్చిన సినిమా ఘాజి. సబ్ మెరైన్ కాన్సెప్ట్ తో వచ్చిన ఘాజి ఎటాక్ సంకల్ప్ రెడ్డి సత్తా ఏంటో చూపించింది. ఇక లేటెస్ట్ గా మళ్లీ ఈ దర్శకుడు స్పేస్ కాన్సెప్ట్ తో సినిమా చేస్తున్నాడు ఆ సినిమానే అంతరిక్షం. వరుణ్ తేజ్ హీరోగా చేస్తున్న ఈ సినిమా టీజర్ ఈరోజు రిలీజ్ చేశారు. స్పేస్ లో ఓ ప్రాజెక్ట్ గురించి వెళ్లిన వరుణ్ తేజ్ టీం ఎలా దాన్ని విజయవంతం చేశారు అన్నది సినిమా కథ.

టీజర్ తోనే దాదాపు సినిమా ఎలా ఉండబోతుంది అన్న ఫీల్ తెచ్చాడు దర్శకుడు సంకల్ప్ రెడ్డి. ఫస్ట్ క్లాస్ మేకింగ్ తో అద్భుతమైన గ్రాఫిక్స్ సెట్టింగ్స్ తో సినిమా వస్తున్నట్టు తెలుస్తుంది. రెగ్యులర్ సినిమా ప్రియులకే కాదు ప్రత్యేకమైన జానర్ సినిమాలు చూసే వారికి ఈ అంతరిక్షం తప్పక నచ్చుతుందని తెలుస్తుంది. వరుణ్ తేజ్ సరసన అదిరి రావు హైదరి, లావణ్య త్రిపాఠి కూడా ఈ సినిమాలో నటిస్తున్నారు. డిసెంబర్ 21న రిలీజ్ ప్లాన్ చేస్తున్న అంతరిక్షం టీజర్ నిజంగానే ప్రేక్షకులను అంత్రిక్షం లోకి తీసుకెళ్లేలా ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version