టాలీవుడ్ లో జబర్దస్త్ ఫాంలో ఉన్నప్పుడు బాలీవుడ్ నుండి ఒక్క ఆఫర్ రాగానే ఇక్కడ నుండి చెప్పాపెట్టకుండా ఉత్తరాధి బాటన పట్టిన గోవా బ్యూటీ ఇలియానా అక్కడ ఆశించిన క్రేజ్ సంపాదించడంలో విఫలమైంది. హిందిలో అడపాదడపా సినిమాలు చేస్తున్న ఈ చిట్టి నడుము సుందరి మళ్లీ సౌత్ సినిమాలు చేయాలని తెగ ఆరాటపడింది. తెలుగు, తమిళంలో ఏ ఒక్క అవకాశమైనా రాకపోద్దా అనుకున్న ఇలియానాకు మాస్ మహరాజ్ రూపంలో అవకాశం వచ్చింది.
శ్రీను వైట్ల డైరక్షన్ లో మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న అమర్ అక్బర్ ఆంటోనీ సినిమాలో రవితేజ సరసన ఇలియానా హీరోయిన్ గా ఛాన్స్ పట్టేసింది. ఈ సినిమాలో నటించినందుకు ఇలియానా 2 కోట్లు చార్జ్ చేసిందని టాక్. అసలేమాత్రం ఫాం లో లేని ఇలియానాకి అంత ఇచ్చారా అన్నది డౌటే అంటున్నారు ఫిల్మ్ నగర్ వర్గాలు.
రోజుకో కొత్త హీరోయిన్ ఎంట్రీ ఇస్తున్న ఇలాంటి టైంలో ఇలియానాకి 2 కోట్లు ఇచ్చి తీసుకోవాల్సిన అవసరం ఏమాత్రం లేదు. మరి ఇలియానా రెమ్యునరేషన్ నిజమా కాదా అన్నది తెలియాల్సి ఉంది.