తెలంగాణలో ఎన్నికలు దగ్గర పడ్డాయి. ఏ రాజకీయ పార్టీ అయినా.. ఎంత ప్రచారం చేసినా చివరకు ఓటరు పోలింగ్ బూత్‌కు వెళ్లి ఓటేస్తేనే వాళ్లు గెలిచేది. ఓట్ల శాతం ఎంత పెరిగితే పార్టీలకు కూడా సీట్లు పెరుగుతాయి. ఓట్ల శాతం తగ్గితే దాని ప్రభావం పార్టీల గెలుపు మీద ఖచ్చితంగా పడుతుంది. అందుకే.. మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ఓటు ఆవశ్యకతను వివరించారు. వచ్చే ఎన్నికల్లో ఎవరికి ఓటేసినా అభ్యంతరం లేదని.. కాకపోతే ఓటు మాత్రం ఖచ్చితంగా అందరూ వేయాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. ఈసందర్భంగా అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా ఓటు హక్కుపై మాట్లాడిన వీడియోను మంత్రి తన ట్విట్టర్ అకౌంట్‌లో షేర్ చేశారు. ఒబామా వ్యాఖ్యలను పూర్తిగా ఏకీభవిస్తున్నట్టు మంత్రి పేర్కొన్నారు.
Absolutely agree with president @BarackObama ?
No matter who you choose, please exercise your vote in #TelanganaElections2018 https://t.co/djy6bTbZUa
— KTR (@KTRTRS) October 17, 2018