Mahesh Babu: సినీ అభిమానుల నోట ‘సర్కారు వారి పాట’..చిత్రంపై పెరిగిన అంచానాలు

-

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన ‘సర్కారు వారి పాట’ చిత్ర షూటింగ్ పూర్తయింది. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ఫిల్మ్ వచ్చే నెల 12న విడుదల కానుంది. తాజాగా ఈ చిత్రం నుంచి టైటిల్ సాంగ్ రిలీజ్ అయింది. ఇప్పటికే ‘కళావతి, పెన్నీ’ సాంగ్స్ సూపర్ హిట్ కాగా, ‘సర్కారు వారి పాట’ టైటిల్ సాంగ్ కూడా ప్రేక్షకుల విశేష ఆదరణ పొందుతోంది.

మహేశ్ బాబు ఇప్పటి వరకు వచ్చిన తన సినిమాల్లో పోషించిన పాత్రల కంటే కొంచెం డిఫరెంట్ గా ఇందులో ఉండబోతున్నారని ఇప్పటికే విడుదలైన ట్రైలర్ , పాటల ద్వారా స్పష్టమవుతోంది. అయితే, ఇందులో కొంత ‘పోకిరి’ సినిమా వైబ్స్ ఉంటాయని, గతంలో మహేశ్ బాబు చెప్పుకొచ్చారు.

ఎస్.ఎస్.థమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. టైటిల్ సాంగ్ కు లిరిక్స్ అనంత శ్రీరామ్ రాశారు. ఈ పాటలోని మాటలు సినీ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. హరికా నారాయణ్ ఆలపించిన ఈ పాటలో ‘‘సర్కారు వారి పాట.. ఆయుధాలు లేని వేట..రివర్స్ లేని బాట’’ అనే లైన్స్ చాలా ఆసక్తికరంగా ఉన్నాయి.

ఇక ఈ చిత్రంలో యాక్షన్ నెక్స్ట్ లెవల్ లో ఉండబోతున్నదని మేకర్స్ అంటున్నారు. మొత్తంగా ‘సర్కారు వారి పాట’ థియేటర్లలో మోత మోగిస్తుందని మహేశ్ -కృష్ణ అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version