దుమ్ములేపిన ‘పుష్ప-2’.. ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే?

-

పుష్ప-2 సినిమా దుమ్ములేపుతోంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప-2 సినిమా గురువారం (డిసెంబర్-5) ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. టాలీవుడ్‌కు కేరాఫ్ అయిన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా బుధవారం రాత్రి నుంచే బెనిఫిట్ షోలు ప్రదర్శించబడ్డాయి. సినిమా చూసిన అభిమానులు మూవీ సూపర్ హిట్, బంపర్ హిట్ అంటూ సంబురాలు చేసుకుంటున్నారు.

Icon star Allu Arjun starrer Pushpa 2 released worldwide on Thursday collections

అయితే… ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ – రష్మిక జంటగా నటించిన ‘పుష్ప-2’ గురువారం విడుదలై హిట్ టాక్‌ తెచ్చుకుంది. ఈ సినిమా తొలి రోజు ప్రపంచ వ్యాప్తంగా రూ.175 కోట్ల కలెక్షన్స్ సాధించినట్లు సినీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఒక్క హిందీలోనే ఈ మూవీ ఫస్ట్ డే రూ.65 – రూ.67 కోట్లు వసూలు చేసినట్లు బాలీవుడ్ విశ్లేషకులు వెల్లడించారు. దీంతో ఒక టాలీవుడ్ డబ్బింగ్ మూవీ హిందీలో అదరగొడుతుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version