ఆంధ్రప్రదేశ్ మహిళలకు అదిరిపోయే శుభవార్త చెప్పేందుకు రంగం సిద్ధం చేసింది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. ఏపీలో ఉచిత బస్సుపై కసరత్తులు చేస్తోందట నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. మన దీపావళికే ఈ ఉచిత బస్సు కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని అందరూ అన్నారు. కానీ బడ్జెట్ సమస్యల కారణంగా దీన్ని ప్రారంభించలేదు. అయితే సంక్రాంతి కానుకగా ఉచిత బస్సు పథకాన్ని ఏపీలో అమలు చేయబోతున్నట్లు తెలుస్తోంది.
ఈ మేరకు ఏపీ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి నిర్వహించిన సమీక్షలో… ఈ ఉచిత బస్సు పైన చర్చకు వచ్చిందట. నెల రోజుల్లో కొత్తగా 1000 బస్సులు అలాగే మరిన్ని అద్దె బస్సులను సమకూర్చుకోవాలని… మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారట. ఉచిత బస్సు కార్యక్రమానికి కావాల్సిన బస్సులన్నీ ఏర్పాటు చేసే దిశగా… అడుగులు వేస్తున్నారట మంత్రి రాంప్రసాద్ రెడ్డి. అన్ని ఒకే అయితే… సంక్రాంతి పండుగ కే..ఏపీలో ఉచిత బస్సు కార్యక్రమం ప్రారంభం కానుందట.