పంట నష్టం వస్తే రైతుకు ఆత్మహత్యే.. సినిమా ఫ్లాప్ అయితే మా పరిస్థితి అంతే.. నాగశౌర్య..!

-

యంగ్ హీరో నాగ శౌర్య ఇటీవల నటించిన చిత్రం కృష్ణ వ్రింద విహారి.. ఈ సినిమా సెప్టెంబర్ 23వ తేదీన రిలీజ్ అవుతున్న నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్ లో భాగంగా హైదరాబాదులో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. ఈవెంట్ లో భాగంగా నాగశౌర్య పలు ఆసక్తికరమైన విషయాలు తెలియజేయడం జరిగింది.. ఇక నాగశౌర్య మాట్లాడుతూ కృష్ణ వ్రిందా విహారి సినిమా తీయడానికి రెండున్నర సంవత్సరాల సమయం పట్టింది.కరోనా కారణంగా సినిమాకు ఎన్నో అడ్డంకులు ఏర్పడ్డాయి. ఇక ఈ సినిమా నిర్మాణంలో ఎన్నో బాధలు ఉన్నాయి. సినిమా నిర్మాతలు డబ్బు తీస్తే తప్ప సినిమా పూర్తి అవ్వదు. ఇక నా తల్లిదండ్రులు ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు. నాకోసం నా మిత్రుడు కోసం డబ్బులు లెక్క చేయలేదు.. సినిమా ఆలస్యమైనప్పుడు డబ్బు లెక్క చేయకుండా వడ్డీలు కూడా నా తల్లిదండ్రులే చెల్లించారు..

సినిమా మీద ప్రేమతో కాదు తమ కొడుకు భవిష్యత్తు బాగుండాలని మాత్రమే. కష్టపడి ఈ సినిమా చేశారు. ఇలాంటి తల్లిదండ్రులు ఎవరికి ఉండరు అంటూ ఎమోషనల్ అయ్యారు. ఇక హీరోయిన్ షేర్లీ ఒక మంచి యాక్టర్.. అందంతోపాటు అభినయం ఉన్న యాక్టర్..ఇక ఈ సినిమా కోసం రాధికా లేకపోతే ఈ సినిమా చేయనని ఆమెతో చెప్పాను. రాధిక మేడం తప్ప మరొకరి ఈ క్యారెక్టర్ చేయలేరు. ఇక బ్రహ్మాజీ తోపాటు మరికొంతమందికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు. ఇక పాదయాత్రలో రైతుల గురించి కూడా ఎక్కువగా తెలుసుకున్నాను. పచ్చటి పొలాలు, పంటలు చూశాను. పంట బాగుంటే రైతులు హ్యాపీగా ఉంటారు.. మేము కూడా రైతుల మాదిరిగానే ఉంటాము.. వరదలు, విపత్తు వస్తే పంట దెబ్బతిని రైతు ఆత్మహత్య చేసుకుంటే.. సినిమా ప్లాప్ అయితే మా పరిస్థితి కూడా అంతే.. కష్టాల్లో మునిగితేలుతాము నష్టమైతే మరింత అప్పుల్లో కూరుకుపోతాము అంటూ నాగశౌర్య ఎమోషనల్ అయ్యారు. తమ భవిష్యత్తు సినీ ప్రేక్షకులపైనే ఉందని కూడా తెలియజేశారు.

Read more RELATED
Recommended to you

Latest news