బన్నీ వ్యాపార సామ్రాజ్యం తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే..!

-

టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ సొంతం చేసుకుని ఇప్పుడు గ్లోబల్ స్టార్ గా ఎదిగే ప్రయత్నం చేస్తున్న అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఐకాన్ స్టార్ గా పేరు దక్కించుకున్న ఈయన సినిమాల్లో మాత్రమే కాదు వ్యాపారవేత్తగా కూడా మరింత పాపులారిటీ అందుకున్నారు. ప్రస్తుతం హైదరాబాదులో బఫెలో వైల్డ్ వింగ్స్, ఏఏఏ సినిమాస్, అల్లు స్టూడియోస్ వంటి బిజినెస్ లను చేస్తూ భారీగా అల్లు అర్జున్ ఆర్జిస్తున్నాడు అని చెప్పాలి. ఇకపోతే ఈయన వ్యాపార సామ్రాజ్యం గురించి తెలిస్తే మాత్రం నిజంగా ఆశ్చర్యపోకమానరు.

బఫెలో వైల్డ్ వింగ్స్:
అల్లు అర్జున్ ప్రముఖ అమెరికన్ స్పోర్ట్స్ బార్ అండ్ రెస్టారెంట్ చైన్ అయిన బఫెలో వైల్డ్ వింగ్స్ కోసం ఒక ఫ్రాంచైజీని ఏర్పాటు చేశారు. హైదరాబాద్ రోడ్ నెంబర్ 36 జూబ్లీహిల్స్ లో సందడిగా ఉండే ప్రాంతంలో ఇది ఎంతో మంది ఆహార ప్రియులకు మంచి ఉత్సాహభరితమైన వాతావరణాన్ని కూడా అందిస్తోంది అని చెప్పవచ్చు.

అల్లు స్టూడియోస్:
అల్లు స్టూడియోస్ అనేది అల్లు అర్జున్ కి చెందిన కొత్త చిత్ర నిర్మాణ సంస్థ. ఇది హైదరాబాదులోని రోడ్ నెంబర్ 10 జూబ్లీహిల్స్ లో ఉంది. ఇందులో పోస్ట్ ప్రొడక్షన్స్ సౌకర్యాలు, ఆడియో రికార్డింగ్ వంటి అనేక సేవలు మౌలిక సదుపాయాలు కూడా వస్తాయి. తన తాతయ్య అల్లు రామలింగయ్య గుర్తుగా ఈ స్టూడియోను నిర్మించారు అల్లు అర్జున్

ఆహా ఓటీటీ ప్లాట్ ఫారమ్:
తెలుగు సినిమాలు వెబ్ సిరీస్ ప్రసారం చేయడానికి వినియోగదారులను అనుమతించే ఓటీటీ ప్లాట్ ఫామ్ కి అల్లు అర్జున్ కో ఫౌండర్ గా పని చేస్తున్నారు. ఆహా ప్రధాన కార్యాలయం హైదరాబాదులోని ఫిలింనగర్ లో ఉంది.

ఇక ఇటీవలే ఏ ఏ ఏ సినిమాస్ మల్టీప్లెక్స్ ను కూడా ప్రారంభించారు. ఇందులో మొత్తం ఐదు స్క్రీన్లు మొదటి స్క్రీన్ 67 అడుగుల ఎత్తులో ఉంటుందని తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version