Ileana: బాబుకి జన్మనిచ్చిన ఇలియానా.. ఫోటో వైరల్..!

-

టాలీవుడ్ హీరోయిన్ ఇలియానా స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగింది.. ఆ స్టార్ డం తోనే బాలీవుడ్లోకి వెళ్లి ఫెయిల్యూర్ హీరోయిన్గా మిగిలిపోయింది. అవకాశాలు తగ్గ ముఖం పట్టడంతో ఈ ముద్దుగుమ్మ గ్లామర్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ కుర్రకారులను మంత్రముగ్ధుల్ని చేస్తోంది. ఇలియానా ఇటీవలీ కాలంలోనే గర్భవతిగా ఉన్నట్లు తెలియజేసి అందరికీ షాక్ ఇచ్చింది.

అయితే ఈ హీరోయిన్ ఇలియానా తాజాగా పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఆగస్టు ఒకటో తేదీన డెలివరీ అయినట్లు ఆమె తన సోషల్ మీడియా వేదికగా తెలిపింది. ఈ శుభ సందర్భంలో మా హృదయాలు ఆనందంతో నిండిపోయాయని ఇలియానా చెప్పుకొచ్చింది. మా అబ్బాయి కోవా ఫినిక్స్ డోలాన్ గా పరిచయం చేస్తున్న అని పేర్కొంది ఇలియానా. అయితే తన బిడ్డకు తండ్రి ఎవరనేది మాత్రం సీక్రెట్ గా ఉంచింది. ఇలియానా కత్రినా కైఫ్ సోదరుడు సెబాస్టియన్ తో గతంలో డేటింగ్ లో ఉన్నట్లు వార్తలు రాగా.. దీనిపై ఇద్దరు స్పందించలేదు.

Read more RELATED
Recommended to you

Latest news