సల్మాన్ ఖాన్ పిలిచి అవకాశాలిచ్చినా.. వ‌దులుకున్న‌ టాలీవుడ్ హీరోయిన్‌..

-

గోవా బ్యూటీ ఇలియానా దేవదాసు చిత్రం ద్వారా పరిచయమై.. పోకిరితో సూపర్ హిట్ అందుకుంది. అప్పటి నుండి తెలుగులో తన సినిమాలతో ఊపేసింది. ఇటు తెలుగు సినిమాలు చేస్తూనే హిందీ సినిమాలు చేస్తూ అక్కడ కూడా మంచి హిట్లు అందుకుంది. అయితే ఈ ముద్దుగుమ్మ‌.. ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది. గతంలో బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ పిలిచి మరీ అవకాశాలు ఇచ్చినా, తాను కాదన్నానని ఆమె తెలిపింది. సల్మాన్ ‘వాంటెడ్’ సినిమా సమయంలో తాను ఎగ్జామ్స్ రాస్తున్నానని చెప్పింది.

సల్మాన్ మరో సినిమా ‘కిక్’ సమయంలో మరో సినిమాకు కమిట్ మెంట్ ఉండటంతో ఆ చిత్రాన్ని చేయలేకపోయానని తెలిపింది. ఈ కారణంగానే రెండు సినిమాలు వదులుకోవాల్సి వచ్చిందని చెప్పింది. ఇక్కడ మరో ఆసక్తికర విషయం ఏమిటంటే… ‘వాంటెడ్’ సినిమా ‘పోకిరి’ రీమేక్ కాగా… ‘కిక్’ సినిమా తెలుగు ‘కిక్’కు రీమేక్. ఈ రెండు తెలుగు చిత్రాల్లో కూడా ఇలియానానే నటించడం విశేషం. హిందీలో ఈ చిత్రాల్లో సల్మాన్ సరసన నటించే అవకాశం వచ్చినప్పటికీ చేయలేకపోయానని ఇల్లీ అలా వాపోయింది.

Read more RELATED
Recommended to you

Latest news