ఆ రోజే తన భర్తను పరిచయం చేస్తానంటున్న ఇలియానా..!

-

గోవా బ్యూటీ ఇలియానా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. దేవదాసు సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో పోకిరి సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ స్టేటస్ ను సొంతం చేసుకుంది. ఇదిలా ఉండగా ఈ గోవా బ్యూటీ తాజాగా పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. అయితే తాను గత కొన్ని నెలల క్రితం ప్రెగ్నెంట్ అంటూ ప్రకటించి డెలివరీ అయ్యి కొడుకుకు జన్మనిచ్చిన తర్వాత కూడా తన గర్భానికి కారణమైన వ్యక్తిని మాత్రం ఆమె బయట పెట్టలేదు.

ఇకపోతే ఈమె నిజంగానే గర్భం దాల్చిందా లేక సరోగసి ద్వారా తల్లి కాబోతోందా అంటూ చాలామంది అనుమానాలు వ్యక్తం చేశారు. కానీ ఆమె అనుమానాలు అన్నింటిని నివృత్తి చేస్తూ బేబీ బంప్ కనిపించేలా ఇంస్టాగ్రామ్ లో ఫోటోలను రిలీజ్ చేసింది. ఇక 9 నెలలు పూర్తి అవడంతో కొడుకుకు జన్మనిచ్చి పండంటి బిడ్డ ఫోటో ను కూడా ఆమె షేర్ చేసింది. అంతే కాదు తన కొడుక్కి కోవా ఫీనిక్స్ డోలన్ అంటూ పేరు కూడా పెట్టేసింది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం ఆ ఫోటోలు కూడా సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారాయి. ఇదిలా ఉండగా ఇలియానా ఇప్పటివరకు తన భర్త ను పరిచయం చేయకపోవడంపై సర్వత్ర చర్చలు మొదలయ్యాయని చెప్పాలి.

పెళ్లి కాకుండానే గర్భం దాల్చిందని అందరూ భావించారు.. కానీ ఈమె ఆ వ్యక్తిని ఏడాది మొదట్లోనే పెళ్లి చేసుకుందని.. పెళ్లి జరిగిన తర్వాత గర్భం ధరించినట్లు సమాచారం. ఇక ఆమె భర్త పేరు మైఖేల్ డోలన్ అని, గత సంవత్సరం నుండి ఇద్దరు డేటింగ్ లో ఉన్నారని సమాచారం. ఇకపోతే ఈ ఏడాది మే 13వ తేదీన కొంతమంది సన్నిహితుల సమక్షంలో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుందట ఈ జంట. తన భర్తను దాచడానికి కొన్ని కారణాలు ఉన్నాయని.. బేబీ పుట్టిన కొన్ని రోజులకు ఒక ఫంక్షన్ చేసి ఆ సందర్భంగా భర్తను తన ఫ్రెండ్స్ తో పాటు ఫ్యాన్స్ కి కూడా పరిచయం చేయబోతుందట ఈ ముద్దుగుమ్మ.

Read more RELATED
Recommended to you

Latest news