రోజు రోజుకు దేశ రాజధాని ఢిల్లీలో డెంగ్యూ కేసులు పెరుగుతున్నాయి. గత వారంలో 105 డెంగ్యూ కేసులు నమోదైనట్లు ఢిల్లీ మున్సిపల్ శాఖ వెల్లడించింది. ఈ ఏడాది ఇప్పటివరకు 348 డెంగ్యూ కేసులు నమోదయ్యాయని, గడిచిన ఐదేళ్లలో ఆగస్టు 6 నాటికి తొలిసారి 175 డెంగ్యూ కేసులు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. గడిచిన ఐదేళ్లలో ఆగస్టు తొలివారం తొలిసారి వందకు పైగా డెంగ్యూ కేసులు నమోదయ్యాయని అధికారులు పేర్కొన్నారు.
అయితే.. పరీక్షల కోసం పంపిన శాంపిల్స్‌లో ‘తీవ్రమైన’ టైప్ 2 డెంగ్యూ స్ట్రెయిన్ కనుగొనడంతో, ఢిల్లీ ప్రభుత్వం మరియు మునిసిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ (MCD) వెక్టర్ ద్వారా సంక్రమించే వ్యాధుల కేసులను నిర్వహించడానికి యుద్ధ ప్రాతిపదికన ప్రయత్నాలను ముమ్మరం చేశాయి. గత కొన్ని వారాలుగా క్రమంగా పెరుగుతోంది. గత నెలలో వరదల కారణంగా నగరంలోని పెద్ద ప్రాంతాలు రోజుల తరబడి నీటిలో మునిగిపోవడం మరియు దోమల ఉత్పత్తిని తనిఖీ చేసే సిబ్బంది సమ్మె కారణంగా పరిస్థితి మరింత తీవ్రమైంది.