ఎన్టీఆర్-చిరంజీవి కాంబోలో సినిమా.. దర్శకుడు ఎవరంటే..?

-

మెగాస్టార్ చిరంజీవి, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబినేషన్‌లో సినిమా? వింటేనే రోమాలు నిక్కబొడుచుకునేలా ఉంది కదా. అదే ఒక వేళ నిజమైతే.. అలాంటి ఈ ఇద్దరి నటులను ఒకే తాటిపైకి తెచ్చేది మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ అయితే ఇంకేమైనా ఉంటుందా? అభిమానుల అంచనాలు ఏ రేంజ్‌లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అసలే తెలుగు నాట మల్టీ స్టారర్ల యుగం నడుస్తోంది ఇప్పుడు.

ఇప్పటికే రామ్ చరణ్-ఎన్టీఆర్ కాంబినేషన్‌లో దర్శకధీరుడు రాజమౌళి ఆర్ఆర్ఆర్ వంటి భారీ బడ్జెట్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాపై అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఈ క్రమంలో ఎన్టీఆర్, చిరంజీవి కాంబోలో ఓ మూవీ రాబోతోందంటూ సీనియర్ సినీ జర్నలిస్ట్ ఇమంది రామారావు బాంబ్ పేల్చాడు.

తాజాగా ఆయన ఓ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఎన్టీఆర్, చిరంజీవి కాంబోలో సినిమా అదిరిపోతుందని, దాదాపు 350కోట్ల బడ్జెట్ ఉంటుందని, త్రివిక్రమ్ మంచి కథను అందిస్తాడని చెప్పుకొచ్చాడు. తండ్రిగా చిరంజీవి, కొడుకుగా ఎన్టీఆర్ నటిస్తారేమోనని తాను అనుకున్నట్లు చెప్పుకొచ్చాడు. ఏదైనా సరే త్రివిక్రమ్ అల్లే కథలు అందర్నీ ఆకట్టుకునేలా ఉంటాయని, ఆ సినిమా కచ్చితంగా కన్నుల పండువగా ఉంటుందని తెలిపాడు.

Read more RELATED
Recommended to you

Latest news