ఓటీటీలోకి నవీన్ చంద్ర హారర్‌ క్రైమ్‌ సిరీస్.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే?

-

టాలీవుడ్లో హీరోగా, విలన్‌గా ప్రేక్షకులను మెప్పిస్తున్న యంగ్ నటుడు నవీన్ చంద్ర. సినిమాలతో పాటు వెబ్‌ సిరీస్‌ల్లోనూ నటిస్తూ డిజిటల్ మీడియాలో సత్తా చాటుతున్నాడు. ఇటీవల వచ్చిన ‘జిగర్‌ తండ: డబుల్‌ ఎక్స్‌’తో వచ్చిన నవీన్ చంద్ర ప్రధాన పాత్రలో నటించిన తాజా సిరీస్‌ ‘ఇన్‌స్పెక్టర్‌ రిషి’. ఈ సినిమా స్ట్రీమింగ్కు రెడీ అయింది.

ఈనెల 29 నుంచి అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో వేదికగా ఈ సిరీస్ ప్రసారం కానుంది. తెలుగు, తమిళంతో పాటు ఐదు భాషల్లో ఇది అందుబాటులో ఉండనుంది. హారర్‌ క్రైమ్‌ కథతో రూపొందిన ఈ సిరీస్‌లో ఆయన పవర్‌ఫుల్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా కనిపించనున్నారు. మొత్తం 10 ఎపిసోడ్‌లతో దీన్ని రూపొందించారు. అంతు చిక్కని హత్యల వెనక ఎవరున్నారనే ఆసక్తికర అంశాలతో తెరకెక్కించారు. ఆ మిస్టరీని ఇన్‌స్పెక్టర్‌ రిషి ఎలా ఛేదించారన్నదే కథాంశం. నందిని దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌లో సునైన, కన్నా రవి, మాలిని జీవరత్నం కీలకపాత్రల్లో కనిపించనున్నారు. ప్రస్తుతం తెలుగులో నవీన్ చంద్ర ‘ఎలెవన్‌’, ‘సత్యభామ’ల్లో నటిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news