మెడపై కత్తిపెట్టి.. కాంగ్రెస్ లోకి రావాలని బెదిరిస్తున్నారు – హరీష్‌ రావు

-

మా పార్టీ నాయకుల మెడపై కత్తిపెట్టి కాంగ్రెస్ లోకి రావాలని బెదిరిస్తున్నారని మాజీ మంత్రి హరీష్‌ రావు ఫైర్‌ అయ్యారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సోదరుడు గూడెం మధుసూదన్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. దీనిపై హరీష్‌ రావు మాట్లాడుతూ…మంత్రి ఆదేశాలతో మేము దాడులు చేస్తున్నామని స్వయంగా RDO చెప్పారు…కాంగ్రెస్ పార్టీ నాయకులకు అక్కడ క్రషర్లు ఉన్నాయి…వాటికి పర్మిషన్ లేకున్నా లీజ్ అయిపోయినా నడుస్తున్నాయని గుర్తు చేశారు.

BRS నాయకులను టార్గెట్ చేస్తూ ఇదంతా చేస్తున్నారు…ఇప్పటికి మూడు కేసులు పెట్టారు…ప్రజా సమస్యలు గాలికి వదిలేశారని ఫైర్‌ అయ్యారు.గ్రామాల్లో తాగు నీరు రావట్లేదు…పంటలు ఎండిపోతున్నాయి ఇవి పట్టించుకోరని ఆగ్రహించారు. ప్రతిపక్షాలపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు…ఈ విషయంలో న్యాయ పోరాటం చేస్తామని హెచ్చరించారు. ప్రజా క్షేత్రంలో కాంగ్రెస్ పార్టీకి శిక్ష వేస్తామని…మా పార్టీ నాయకుల మెడపై కత్తిపెట్టి కాంగ్రెస్ లోకి రావాలని బెదిరిస్తున్నారని నిప్పులు చెరిగారు. పార్టీ మారకపోతే అక్రమ కేసులు పెట్టి బెదిరిస్తున్నారు, ప్రలోభాలకు గురిచేస్తున్నారని పేర్కొన్నారు హరీష్‌ రావు.

Read more RELATED
Recommended to you

Latest news